CM CPROగా... NTV రమేష్...!?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో కొన్ని కీలక నియామకాలను చేపట్టబోతున్నారు. నామినేటెడ్ పదవులతో పాటు, సిఎంఓకు సంబంధించిన మరికొన్ని పదవులను, కొంత మంది సలహాదారులను నియమించబోతున్నారు. అంతా అనుకున్నట్లు అయితే.. ఈ పదవులను ఆగస్టు మొదటివారంలో భర్తీ చేస్తారంటున్నారు. టీటీడీ ఛైర్మన్ పోస్టును కూడా భర్తీ చేస్తారని, అయితే..ముందు అనుకున్నట్లు ఓ టీవీ ఛైర్మన్‌కు ఆ పదవి దక్కకపోవచ్చని, బీసీ వర్గానికి చెందిన వారితో ఆ పదవిని భర్తీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా..జర్నలిస్టు వర్గాల్లో ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిపిఆర్ ఓగా గతంలో ఎన్‌టివిలో పనిచేసిన రమేష్ అనే జర్నలిస్టును నియమించబోతున్నారనేది ఈ వార్త సారాంశం. రమేష్ గతంలో ఆంధ్రజ్యోతి, ఎన్‌టివిల్లో పనిచేశారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎన్‌టివి సచివాలయ రిపోర్టర్‌గా పనిచేశారు. ఇటీవల కాలంలో ఆయన ఎన్‌టివిని వదిలేసి చంద్రబాబు వద్దకు వచ్చారు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా కీలకంగా పనిచేశారని చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు చంద్రబాబుతో కలసి ఆయన పనిచేశారని, దీంతో ఆయనను సిపిఆర్ ఓగా నియమిస్తారని ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు పలువురు జర్నలిస్టులు సిపిఆర్ ఓ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే..రమేష్‌కు ఈ పదవి దాదాపు ఖాయమైందని, ఇక ఆయనకు ఆర్డర్స్ ఇవ్వడమే మిగిలిందని, ఆగస్టు మొదటివారంలో విడుదలయ్యే పదవుల లిస్టులో ఆయన పేరు తప్పక ఉంటుందనే చర్చ జర్నలిస్టు వర్గాల్లో ఉంది. కాగా..గత ఐదేళ్ల కాలంలో ఎన్‌టివి చంద్రబాబుకు, టిడిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందని టిడిపి వర్గాలు ఆరోపిస్తుంటాయి. మరోవైపు మరికొందరు జర్నలిస్టులు ఈ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. టిడిపి అనుకూలమీడియాలో జర్నలిస్టులుగా చర్చల్లో పాల్గొనే వారిలో చాలా మంది ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే..వీరందరినీ పక్కన పెట్టి ఆరూర్ రమేష్‌ను చంద్రబాబు ఎంపికచేశారని, ఆయనకు పదవి దక్కడం లాంఛనమేనంటున్నారు.