పారదర్శకతకు పెద్దపీట..!
రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం పారదర్శిక పాలనకు శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వం ప్రజలకు ఏమి హామీ ఇచ్చిందో..అదే చేస్తూ..ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చాటి చెబుతోంది. గత జగన్ ప్రభుత్వం ఏమి చేసినా..దొంగచాటు వ్యవహారాలు చేస్తూ ప్రజలను ప్రతి నిత్యం మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..చంద్రబాబుపై నిత్యం అసత్యాలతో దాడి చేసి, అధికారంలోకి వచ్చిన తరువాత పరదాలతో తిరిగారు. పాలనలోనూ రహస్య జీవోలు ఇస్తూ..ప్రభుత్వం ప్రజలకు ఏమి చేస్తుందో తెలియకుండా చేశారు. ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులో లేకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రహస్య జీవోలపై అప్పట్లో కొందరు హైకోర్టును ఆశ్రయించినా జగన్ ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం కలగలేదు. మొండిగా, బండగా, మూర్ఖంగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు పాతాళలోకానికి తొక్కేశారు. గతంలో అందరికీ అందుబాటులో ఉన్న జీవో వెబ్‌సైట్‌ను మార్చివేసి..ఎపి గెజిట్ అంటూ జగన్ తన రహస్య కార్యకలాపాలను సాగించారు. అయితే..ఇప్పుడు కూటమి ప్రభుత్వం పారదర్శికంగా గతంలో ఉన్న జీవో వెబ్‌సైట్‌ను మళ్లీ పునరుద్ధరించింది. ప్రభుత్వం విడుదల చేసే అన్ని జీవోలను ఇక నుంచి గతంలో ఉన్నట్లే... https://goir.ap.gov.in/లో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని కూటమి ప్రభుత్వం ఈ చర్య ద్వారా చాటి చెప్పింది.