తండ్రి హయాంలో...IASలు....తనయుడి హయాంలో IPSలు...!
అధికారాన్ని వాడుకుని, అడ్డగోలుగా వందల కోట్లు పోగేసుకోవడంలో, అదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్ధులను వేధించడంలో..హింసించడంలో..హత్యలు చేయడంలో..వై.ఎస్.కుటుంబాన్ని మించిన రాజకీయ కుటుంబం మరోటి ఉండదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు పాలించమని అధికారం ఇస్తే..అదేదో..తమ సంపదను పోగేసుకోవడానికి, రాజభవనాలు కట్టించుకోవడానికి ఇచ్చినట్లు ఆ కుటుంబం భావిస్తుంటుంది. అధికారం ఉన్ననాళ్లు అడ్డమైన అవినీతికి, అరాచకాలకు పాల్పడడం...తరువాత..అందులో ఉన్నతాధికారులను ఇరికించడంలో వై.ఎస్.కుటుంబానిది తిరుగులేని రికార్డు. ఆల్ ఇండియా లెవల్‌లో..దీనిలో పోటీ పెడితే..ఆ కుటుంబం తప్ప మరెవరూ..గెలవలేరేమో...? తాజాగా..ముంబయి సినీ నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపిఎస్ అధికారులతో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. తనకు అప్పన్నంగా దోచిపెడుతోన్న ఓ పారిశ్రామికవేత్తను లైంగిక వేధింపుల కేసు నుండి కాపాడడానికి ముఖ్యమంత్రిగా జగన్ తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి..అమాయకురాలైన ఆడపిల్లను హింసించడానికి తన పోలీసు అధికారులను ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. అప్పట్లో..అధికారం ఉండడంతో..అంతా ఇష్టారాజ్యంగా చెలామణైంది. అయితే..అధికారం పోవడంతో...చేసిన పాపాలు ఇప్పుడు బయటపడి కటకటాలకు దారి చూపుతున్నాయి. అయితే..చేయించిన వారి కన్నా..చేసిన వారే ముందుగా..దీనిలో ఇరుక్కున్నారు. జత్వానీ కేసులో సీనియర్ ఐపిఎస్‌లు పిఎస్ ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, క్రాంతి తాతాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే బాటలో మరి కొందరిని సస్పెండ్ చేయబోతోంది.
అయితే..వై.ఎస్.కుటంబానికి ఇలా అధికారులను ఇరికించడం ఇదేమీ తొలిసారి కాదు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని..తనయుడి ఆస్తులను పెంచుకోవడానికి అడ్డదిట్టంగా వాడేసి, తరువాత అధికారం పోవడంతో అక్రమాలు బయటకు వచ్చాయి. అప్పట్లో వై.ఎస్.చెప్పినట్లా చేసిన ఐఏఎస్ అధికారులు తరువాత జగన్‌తో పాటు జైలుకు వెళ్లారు. అప్పట్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజశేఖర్‌రెడ్డి చెప్పినట్లల్లా చేసేశారు. తరువాత..ఇప్పటికీ ఆ కేసుల్లో కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గతంలో జరిగిన పరిణామాలను గుర్తుపెట్టుకోకుండా జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత..ఆయనే శతాబ్దాలపాటు ముఖ్యమంత్రిగా ఉంటారు..ఇక మనకు తిరుగులేదని కొంత మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, జగన్ చెప్పినచోటల్లా సంతకాలు చేసేశారు. అయితే..కాలం మహిమతో జగన్ పతనం కావడంతో..ఇప్పుడు ఈ ఉన్నతాధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నేడు సస్పెండ్ అయిన అధికారులు రేపటి రోజున జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. తండ్రి హయాంలో..ఐఏఎస్‌లు వంతైతే..తనయుడి హయాంలో..ఐపిఎస్‌ల వంతు వచ్చిందని అధికారులు నిర్వేదంగా చెబుతున్నారు. అలా ఉంటుంది..వై.ఎస్.కుటుంబ వాడకం...!