నాణ్యమైన మద్యం...99/-కే...!?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నూతన మద్యం పాలసీని ప్రకటించింది. నూతన మద్య విధానంలో భాగంగా నాణ్యమైన మద్యాన్ని కేవలం రూ.99/- కే అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గత ఐదేళ్ల జగన్ పాలనలో మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. అత్యంత నాసిరకమైన మద్యాన్ని వినియోగదారులకు అమ్మారని తద్వారా జగన్ వేల కోట్ల రూపాయలను అర్జించారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యరహిత రాష్ట్రాన్ని చేస్తానని, ఎన్నికలకు ముందు జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా మద్యాన్ని ముట్టుకుంటే షాక్ తగిలేలా ధరలు ఉంటాయని చెబుతూ..మద్యం రేట్లను విపరీంతగా పెంచేశారు. దేశంలో ఎక్కడా లేని రేట్లకు మద్యాన్ని అమ్మి పేద ప్రజలను నిలువునా దోచుకున్నారు. మద్యానికి అలవాటు పడిన వారికి మద్యం రేట్లను పెంచితే..వాటిని వినియోగించరి అప్పటిముఖ్యమంత్రి జగన్ తన విధానాలను విమర్శించిన వారిపై ఎదురుదాడి చేశారు. అయితే..ఆయన మాటలు బూటకమని, తమను దోచుకునేందుకే జగన్ ఇటువంటి విధానాన్ని తెచ్చారని మద్యం వినియోగదారులు ఆరోపించారు. అయితే..ఎవరు ఎంత మొత్తుకున్నా..జగన్ వారిని లక్ష్యపెట్టలేదు. అయితే..ఎన్నికల సమయంలో తమను మోసగించిన జగన్‌కు మద్యం వినియోగదారులు ఓటుతో సమాధానం చెప్పారు. కాగా..అప్పట్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే..నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు ఇస్తామనిహామీఇచ్చారు. ఆ హామీలో భాగంగా నూతన మద్యపాలసీని ప్రకటించబోతున్నారు. క్వాటర్ మద్యం ధర రూ.99కే ఇస్తామని ప్రకటించారు. గతంలో వినియోగించే బ్రాండలన్నింటిని తెస్తామని, అదే విధంగా నాణ్యత కలిగిన మద్యాన్ని అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కాగా..రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే మద్యం విధానంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం వినియోగించేవారిని ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు తగ్గించడంతో పాటు, నాణ్యమైన మద్యం ఇస్తున్నామని ప్రకటించి..వారిని మరింతగా తాగుబోతులుగా మార్చబోతోందని విమర్శిస్తున్నారు. అదే సమయంలో ప్రవేట్ వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించబోతున్నారని, తద్వారా..వారంతా సింటికేట్ అయి మద్యం ధరలను పెంచుతారని, దీనితో మళ్లీ వినియోగదారులపై భారం పడుతుందనే భావన వ్యక్తం అవుతోంది. కాగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపాలని, తద్వారా మద్యం ధరలు పెరగకుండా ఉంటాయని కొందరు కోరుతున్నారు. అయితే..ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులకు రెండేళ్లపాటు మద్యం దుకాణాలకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ విధానం ద్వారా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం వ్యాపారులు ఎలా సిండికేట్ అయ్యారో..ఇప్పుడూ..అదే విధంగా అవుతుందని వారు చెబుతున్నారు. మొత్తం మీద..తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం దొరుకుతుందన్న ప్రభుత్వ ప్రకటన మందుబాబుల్లో సంతోషాన్ని, ఉషారును కల్గిస్తోంది.