SERPనిధులను దోచిపెట్టినందుకే..ఆ ఐఏఎస్‌కు జగన్ టిక్కెట్ ఇచ్చారా...!?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి సొమ్ములు ఇచ్చేవారంటే మహాప్రీతి. అదీ ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కట్టబెట్టేవారిపై అమితమైన ప్రేమ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదవిలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారికి తన పార్టీ తరుపున అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. అప్పట్లో ఆ ఐఏఎస్‌కు ఎందుకు టిక్కెట్ ఇచ్చారో..? అనే దానిపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అయితే..ఆ ఐఏఎస్ అధికారి మైనార్టీ వర్గానికి చెందిన వారు అవడం, అక్కడ ఆ సామాజికవర్గానికి చెందిన వారు గణనీయంగా ఉండడంతో..కులాల, మతాల లెక్క చూసుకుని ఆ అధికారితో పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఉంటారని రాజకీయ, అధికారవర్గాలు భావించాయి. అయితే..అది కారణం కాదని, ఆ ఐఏఎస్ అధికారి పదవిలో ఉండగా..తాను చూస్తోన్న డిపార్ట్‌మెంట్ నుంచి భారీగా నిధులను ప్రభుత్వ ఎకౌంట్‌కు బదిలీ చేశారు. ఇలా నిధులను బదిలీ చేయడం చట్టవిరుద్ధం. అయినా..ఆ ఐఏఎస్ అధికారి నిబంధనలను పట్టించుకోకుండా జగన్‌కు మేలు చేయాలని, పేదల సొమ్మును ప్రభుత్వానికి దోచిపెట్టారు. ఈ ఐఏఎస్ భక్తికి మెచ్చిన జగన్ ఆయనకు ముందుగా ఎంపి టిక్కెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ..ఎందుకో లెక్కలు కుదరక ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. అయితే..ప్రజలు ఎన్నికల్లో ఆయనను ఓడించారు. ఒక వేళ వైకాపానే గెలిచి ఉంటే..తనకు మైనార్టీ కోటా కింద మంత్రి పదవి వస్తుందనే భావనతో జగన్ ఏమి చేయమంటే అది చేశారు..ఐఏఎస్ అయ్యవారు..! పేదల సొమ్ము..అదీ బడుగు,బలహీనవర్గాలు రూపాయి...రూపాయి దాచుకున్న సొమ్మును విచ్చలవిడి పందేరాలకు జగన్, ఐఏఎస్ అధికారి కలసి పంచేశారు. ఈ అరాచకం ఈ రోజు ముఖ్యమంత్రి వద్ద సెర్ఫ్ సమీక్ష సందర్భంగా బయటపడింది. స్త్రీశక్తి నిధికి సంబంధించిన దాదాపు రూ.950 కోట్లను పిడి ఎకౌంట్లకు బదిలీ చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా ఫేక్ గ్రూపులను సృష్టించి నిధులను కొల్లగొట్టేశారని, ఒక్క పీఠాపురం మండలంలోనే దాదాపు రూ.7కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేయిస్తే..ఇంకా ఎన్ని ఫేక్ గ్రూపుల బయటకు వస్తాయో తేలుతుందని మంత్రి అన్నారు. కాగా ఫేక్ వికలాంగ ఫించన్లు, ఇతర ఫించన్లపై విచారణకు ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని మంత్రి చెప్పారు.