స్కిల్ కేసు శుక్రవారానికి వాయిదా...!
స్కిల్ కేసును సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇరువైపుల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ తరుపును వాదించిన ముకుల్ రోహిత్గి చంద్రబాబుకు 17ఏ వర్తించదని మరోసారి వాదించారు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదని, అవినీతి నిరోధం కోసమే ఈ చట్టం తెచ్చారని, అవినీతి పరులను కాపాడేందుకు కాదన్నారు. న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదని, ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉందని రోహత్గీ అన్నరు. వందల కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 482 సీపిఆర్‌సి కింద కేసును క్వాష్ చేయలేమని, అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు కోర్టుకు విచారించే హక్కు ఉందన్నారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను వంటి సంస్థలు కూడా దర్యాప్తు చేశాయని, మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తాయని రోహిత్గీ చెప్పారు. కాగా రోహిత్గీ వాదలను చంద్రబాబు న్యాయవాది హరీష్ సాల్వే తోసిపుచ్చారు. రాజకీయ కక్షతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబుపై కేసులు నమోదు చేస్తోందని, వరుసుగా కేసులు పెడుతూపోతుందని, రాజకీయ కక్షలనుంచి రక్షించేందుకే సెక్షన్ 17ఏను తెచ్చారని, 17ఏ లేకపోతే రాజకీయంగా వేధిస్తారని, తన క్లయింట్‌పై పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపేనని ఆయన కోర్టుకు విన్న వించారు. కాగా 71 ఏళ్ల తన క్లయింట్ గత 40 రోజులుగా జైలులో ఉంటున్నారని, ఆయనకు ఇంటీరియ్ బెయిల్ ఇవ్వాలని హరీష్ సాల్వే కోరారు. కాగా కేసును శుక్రవారానికి న్యాయమూర్తులు వాయిదా వేశారు.