కొండా సురేఖ..ఇవేం వ్యాఖ్యలు...!?
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు..దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. రాజకీయంగా ఆమెను బిఆర్ ఎస్ నేతలు ఇబ్బంది పెట్టారని చెబుతూ..సినీనటి సమంత గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా యాక్టర్ల జీవితాలతో కెసిఆర్ తనయుడు కెటిఆర్ ఆడుకున్నారని ఆమె ఆరోపించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ..సమంత విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెట్‌జన్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె సమంత గురించి ఏమన్నారంటే... ఎన్ కన్వెన్షన్ ను కూల్చకుండా ఉండాలంటే అక్కినేని చైతన్య భార్య అయినటువంటి సమంతను కెటిఆర్ దగ్గరకు పంపాలని కెటిఆర్ కోరారని, దానికి నాగార్జున, నాగచైతన్యలు అంగీకరించారని, కెటిఆర్ దగ్గరకు సమంతను వెళ్లాలని నాగార్జున, నాగచైతన్య ఆమెపై ఒత్తిడి చేశారని, ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో..నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చారని ఆమె చెప్పారు. ఒక కుటుంబం గురించి అంత పచ్చిగా ఒక మంత్రి మాట్లాడడం..తీవ్ర దుమారం రేపుతోంది. నాగార్జున కుటుంబం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు..విన్నవారు..ఇలా మాట్లాడతారా..? అదీ ఒక మహిళా మంత్రి..దానిలో నిజం ఎంతో..? అబద్దం ఎంతో..దేవుడికి నాగార్జున కుటుంబ సభ్యులకే తెలుసు. కానీ బజారులో మాట్లాడుకునేమాటలు ఒక మహిళా మంత్రి మాట్లాడడం..ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. అసలు వారి వ్యక్తిగత జీవితం గురించి ఈమె మాట్లాడం...ఏమిటి..? నాగార్జున, నాగచైతన్యలు ఎటువంటి వారైనా సరే..ఒక మహిళ గురించి అంత పచ్చిగా మాట్లాడతారా..? సమంత వచ్చి మంత్రికి చెప్పిందా..ఇలా చెప్పండి..అనీ..ఏమిటీ బరితెగింపు. రాజకీయాల్లో దిగజారడానికి ఇంకేమీ లేదా..? ఇప్పటికే రాజకీయాల్లో నైతికత పాతాళలోకంలో ఉన్నాయి..అంతకన్నా..ఇంకేమి ఉంది...? మొత్తానికి కెటిఆర్‌ను విమర్శించడానికి, నాగార్జున, నాగచైతన్య వ్యక్తిత్వాన్ని ఒక దెబ్బతో..సురేఖ కూల్చేశారు.