విజయమ్మకు విచక్షణ లేదట...!?
వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి చివరికి తన స్వంత తల్లినీ వదలడం లేదు. తనకు ఎదురువచ్చిన ప్రతివారిపై దాడి చేసే వైకాపా అధినేత తల్లి విజయమ్మపై కూడా నిందలేస్తున్నారు. తన తల్లికి విచక్షణ లేదని, ఆమె తనను జైలుకు పంపించేందుకు చేస్తోన్న కుట్రలో భాగమయ్యారని తీవ్రస్థాయిలో నిందించారు. స్వంత కుమారుడనే విచక్షణ ఆమెకు లేదని, తనను జైలుకు పంపించేందుకు చేస్తోన్న కుట్రలో ఆమె షర్మిలకు సహకరిస్తున్నారని తన స్వంత పత్రికలో ఆమెపై ఎదురుదాడి చేశారు. వై.ఎస్.కుటుంబ ఆస్తులపై కుమారుడు, కుమార్తె పోట్లాడుకుంటున్న వైనంపై విజయమ్మ నిన్న బహిరంగ లేఖద్వారా స్పందించారు. కుమారుడైన జగన్ తన కూతురు షర్మిలకు అన్యాయం చేస్తున్నారని, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, వై.ఎస్. జీవించినప్పుడు ఆస్తులు పంచలేదని ఆమె ఖరాఖండిగా ఆ లేఖలో చెప్పారు. దాంతో..జగన్ తల్లిపై కూడా కత్తి దూశారు. ఆమెకు విచక్షణ లేదని, మోపపూరిత చర్యలకు ఆమె మద్దుతు ఇస్తున్నారని, కుమార్తె పక్షం వహిస్తున్నారని, ఇంగితం లేదని విమర్శిస్తూ ఓ పుల్‌పేజీ వార్తను ఆమెపై తన పత్రికలో ప్రచురించుకున్నారు. కాగా ఇన్నాళ్లూ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వారి, వారికి వ్యతిరేకంగా ఉండేవారిని అడ్డగోలురాతలతో వేధించిన జగన్ పత్రిక ఇప్పుడు జగన్ తల్లి విజయమ్మపై కూడా విషం చిమ్ముతూ వార్తలు ప్రచురిస్తోంది. తనకు ఎవరు ఎదురు వచ్చినా..చివరకు తల్లి అయినా..తండ్రి అయినా..చెల్లి అయినా..వదిలేది లేదనేది జగన్ సిద్దాంతం. ఇన్నాళ్లూ చెల్లిని వివిధ రకాలుగా వేధించిన జగన్ చివరకు తల్లినీ వేధించడానికి సిద్ధమనే సంకేతాలను పంపిస్తున్నారు. ఆస్తుల కోసం ఎంత దూరమైనా వెళతానని ఆయన తాజాగా విజయమ్మకు కౌంటర్ ద్వారా జగన్ మరోసారి స్పష్టం చేశారు.