లేటెస్ట్

ప్ర‌జ‌లు ఆనందంగా ఉన్నారు:ఎమ్మెల్యే భూమా

సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మిషన్ పార్ట్ హోల్ ఏపీ ఫ్రీ రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతకుంట గ్రామంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నెన్నోమంచి పనులు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై ప్రజల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయ‌ని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోకుండా నెరవేరుస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నార‌ని ఆమె చెప్పారు. గత ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అంటే గుంతల రాష్ట్రంగా పేరుగాంచిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అప్పట్లో రోడ్లపై వైసిపి నాయకులు పై టీడీపీ నాయకులు అలాగే ప్రజలు వినూత్న రీతిలో వీడియోల ద్వారా నిరసనలు తెలిపారు. గుంతల రోడ్లతో చాలా ఇబ్బంది పడ్డారు. కానీ టీడీపీ గవర్నమెంట్ లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ల కు మరమత్తులు చేపడుతున్నారు. అందులో భాగంగా నేడు ఆళ్ళగడ్డ నుండి కోవెలకుంట్ల రోడ్డులో ఉన్న గుంతలను పుడుస్తున్నట్లు టీడీపీ ఎంఎల్ఏ అఖిల ప్రియ తెలిపారు. రౌడీ నాయకులు పాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో జగన్ మోహన్ రెడ్డి చూపిస్తే సమర్ధత గలవారు పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు చూపించాలి. అన్నట్లుగా ఆయన చేసే పనులే చూపిస్తున్నాయి.ఆళ్ళగడ్డ తాలూకాకు 80 లక్షల రూపాయలు 65 km మేరా పూడ్చేందుకు ఈ కార్యక్రమం ద్వారా గుంతలు పుడుస్తున్నామని అఖిల ప్రియ అన్నారు. 2వ కోటాలో 4 కోట్లు శాంక్షన్ చేయించుకొని మిగతా పనులు మొదలు పెడతామని ఆమె చెప్పారు. చాలా దారుణంగా ఉండే రోడ్డును నేడు కళ్ళు మూసుకొని వెళ్లేలా సంక్రాంతి కి పనులన్నీ పూర్తీ చేయాలి అని అధికారులకు అదేశాలు చేసారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మొదటి కోటాకు గాను 400 కిలోమీటర్లకు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగిందని ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం కేంద్రం నుండి నిధులు తెప్పించుకొని ప్రతి ఒక్క పనిని చేసి చూపిస్తానని తెలుగుదేశం ప్రభుత్వంలో ఆళ్లగడ్డను అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ  తెలిపారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ