లేటెస్ట్

అధికారం టిడిపిదే...ఇండియాటుడే స‌ర్వే

టిడిపికి 17, వైకాపాకు 8 ఎంపీ స్థానాలు


ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే..రాష్ట్రంలో అధికార వైకాపా ఘోరంగా ఓడిపోతుంద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైన ప్ర‌తిప‌క్ష టిడిపి అధికారంలోకి వ‌స్తుంద‌ని, ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ఇండియా టుడే త‌న స‌ర్వేలో పేర్కొంది. మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరిట ఆ సంస్థ ఆరు నెల‌లోకోసారి స‌ర్వేలు విడుద‌ల చేస్తుంది. దానిలో భాగంగా ఈ స‌ర్వేను నిర్వ‌హించింది. ఇండియాటుడే స‌ర్వేకు అత్యంత విశ్వ‌స‌నీయ‌త ఉంది. ఈ సంస్థ గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన స‌ర్వే వాస్త‌వ‌మైంది. అంతే కాకుండా ప‌లు రాష్ర్టాల్లో ఇంత‌కు ముందు ఆ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలు వాస్త‌వ‌మ‌య్యాయి. అటువంటి విశ్వ‌స‌నీయ‌త ఆ సంస్థ‌కు ఉంది. ఇండియాటుడే నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం, జ‌న‌సేన‌లు క‌లిసి 17 పార్ల‌మెంట్ స్థానాలు సాధిస్తాయ‌ని, అధికార వైకాపా 8 స్థానాల‌కు ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తెలిపింది. టిడిపి+జ‌న‌సేన‌కు 45శాతం ఓట్లు వ‌స్తాయ‌ని, వైకాపాకు 41శాతం, కాంగ్రెస్‌కు 2.67శాతం, బిజెపికి 2శాతం ఓట్లు వ‌స్తాయ‌ని ఆ సంస్థ పేర్కొంది.  ఈ స‌ర్వే కోసం ఆ సంస్థ 25 పార్ల‌మెంట్ స్థానాల్లోని   35,801 మందితో మాట్లాడింది. ఈ స‌ర్వేను డిసెంబ‌ర్ 15 నుంచి జ‌న‌వ‌రి 28 వ‌ర‌కు చేప‌ట్టిన‌ట్లు పేర్కొంది.  అదే విధంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు 10 పార్ల‌మెంట్ స్థానాలు, బిఆర్ ఎస్‌, బిజెపిల‌కు చెరో మూడు స్థానాలు వ‌స్తాయ‌ని పేర్కొంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ