లేటెస్ట్

స‌ల‌హాదారుల‌ను సాగ‌నంపుతారా...?

రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ రెండేళ్ల పాల‌నాకాలంలో దాదాపు 50 మందిని ఆయ‌న స‌ల‌హాదారులుగా నియ‌మించుకున్నారు. ఈ స‌ల‌హాదారుల నియామ‌కంపై ప్ర‌తిప‌క్షాలు అభ్యంత‌రాల‌ను తెలుపుతోంది. ఇంత‌మంది స‌ల‌హాదారులు ఏమిట‌ని, దేశంలో ఎక్క‌డా ఇంత‌మంది స‌ల‌హాదారులు లేర‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. భారీగా స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకుని, వారికి భారీస్ధాయిలో జీత‌,భ‌త్యాల పేరుతో క‌ట్ట‌బెడుతున్నార‌ని, ప్ర‌జాధ‌నాన్ని ఇష్టారాజ్యంగా ఖ‌ర్చుచేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు సంబంధించిన ప‌త్రిక‌కు చెందిన వారిని కూడా స‌ల‌హాదారులుగా నియ‌మించార‌ని, ప్ర‌జాధ‌నాన్ని త‌న స్వంత ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న వారికి ఇస్తున్నార‌ని, అధికారం చేతిలో ఉంటే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా..అంటూ వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత మంది స‌ల‌హాదారులు ఉండి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వానికి ఇచ్చిన స‌ల‌హాలు ఏమిటి..?  వారి వ‌ల్ల క‌లిగిన ప్ర‌యోజ‌నం ఏమిటో చెప్పాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఈ వ్య‌వ‌హారం ఇప్ప‌టిదాకా ప్ర‌భుత్వానికి, ప్ర‌తిప‌క్షానికి మ‌ధ్య వివాదంగా, విమ‌ర్శ‌ల‌కు, ఆరోప‌ణ‌ల‌కు కార‌ణం కాగా, ఇప్పుడు ఈ విష‌యంలో హైకోర్టు దృష్టికి వ‌చ్చింది. ఎటువంటి అర్హ‌త‌లు లేకుండా, వారితో ఎటువంటి ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన అవ‌స‌రాలు లేకుండా ఎలా వారిని నియ‌మిస్తున్నార‌ని హైకోర్టు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ప్ర‌భుత్వం తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల‌కు గురి అవుతున్న స‌మయంలో ఇంత మంది స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకోవ‌డం స‌రికాద‌ని, వారికి హైకోర్టు న్యాయ‌మూర్తుల క‌న్నా ఎక్కువ జీత‌భ‌త్యాలు ఇస్తున్నార‌ని, ప్ర‌భుత్వ తీరు స‌రిగా లేద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా ఉన్న‌వారు ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు చూసుకోకుండా రాజ‌కీయాలు మాట్లాడుతున్నార‌ని ఆక్షేపించింది.

స‌ల‌హాదారుల‌పై హైకోర్టు వ్యాఖ్య‌లు, ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తిని గ‌మ‌నించి ప్ర‌భుత్వం స‌ల‌హాదారుల‌ను సాగ‌నంపుతుందా..? అన్న ప్ర‌శ్న‌లు వైకాపా వ‌ర్గాల్లోనే వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు కేసుల విష‌యంలో హైకోర్టు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పులు ఇచ్చిన నేప‌థ్యంలో ఇప్పుడు స‌ల‌హాదారులను తొల‌గించాల‌ని రేపు ఎవ‌రైనా కోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యాలు దాఖ‌లు చేస్తార‌ని, అప్పుడు కోర్టు దీనిపై త‌గిన నిర్ణ‌యం తీసుకుంటుందేమోన‌న్న అనుమానాలు వారిలో ఉన్నాయి. దీంతో ప్ర‌స్తుతం ఉన్న‌స‌ల‌హాదారుల ప‌ద‌వీకాలం ముగిసిన వారిని మ‌ళ్లీ స‌ల‌హాదారులుగా నియ‌మించ‌ర‌ని, వారంద‌రినీ సాగ‌నంపుతార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అటువంటి నిర్ణ‌యం తీసుకోర‌ని, ఆయ‌న గ‌త నిర్ణ‌యానికే క‌ట్టుబడి ఉంటార‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద స‌ల‌హాదారుల విష‌యంపై హైకోర్టు వ్యాఖ్య‌లు చేసిన త‌రువాత ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెరిగింద‌ని అంద‌రూ అంగీక‌రిస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ