లేటెస్ట్

ఎవ‌రా...కేంద్ర‌మంత్రి కుమారుడు...?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ అదే పార్టీకి చెందిన రెబెల్ ఎంపి ర‌ఘురామ‌కృష్ణంరాజు సీబీఐ కోర్టులో దాఖ‌లు చేసిన పిటీష‌న్ పై ఈ నెల 25వ తేదీన తీర్పు రాబోతోంది. ఈ కేసులో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని, ఎట్టి ప‌రిస్థ‌తిల్లో ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి అవుతార‌ని ర‌ఘురామ చెబుతున్నారు. ఆయ‌నొక్క‌రే కాదు..మ‌రి కొంద‌రు ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌కు చెందిన వారు కూడా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ విష‌యంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు ఒక్క‌రే బ‌హిరంగంగా మాట్లాడుతుండ‌గా ఇప్పుడు ఆయ‌నకు కాంగ్రెస్ కు చెందిన చింతామోహ‌న్ తొడ‌య్యారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని, ఆయ‌న మాజీ కాబోతున్నార‌ని చింతామోహ‌న్ ఈ రోజు విలేక‌రుల స‌మావేశంలో వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ త‌న బెయిల్ ర‌ద్దు కాకుండా ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నార‌ని, దాని కోసం ఓ ఉత్త‌రాదికి చెందిన పారిశ్రామిక‌వేత్త‌తో పాటు, బిజెపి కేంద్ర‌మంత్రిగా ఉన్న‌నేత త‌న‌యుడి స‌హ‌కారం తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. దీనితో జ‌గ‌న్ కు స‌హ‌క‌రిస్తోన్న బిజెపి కేంద్ర మంత్రి ఎవ‌ర‌నే దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ఆ కేంద్ర మంత్రి ఎవ‌రు..? అని ప్ర‌శ్నించుకుంటున్నారు.


కాగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ కు స‌హ‌క‌రిస్తోన్న బిజెపి పెద్ద త‌ల‌కాయ‌లే మ‌ళ్లీ ఆయ‌న‌ను ఆదుకుంటున్నార‌ని చ‌ర్చ సాగుతోంది. సీబీఐని అధీనంలో ఉంచుకునే మంత్రే మ‌రోసారి ఆప‌ద్భాందవుని పాత్ర పోషిస్తార‌ని ఆ వ‌ర్గాలు అంటున్నాయి. ఆయ‌న త‌ల‌చుకుంటేనే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కాకుండా ఆగుతుంద‌ని, లేక‌పోతే అది జ‌ర‌గ‌ద‌ని ఆ వ‌ర్గాలు అంటున్నాయి. కాగా ఈ కేసులో మొద‌టి నుంచి సీబీఐ వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే అనుమానాలు వ‌స్తున్నాయి. మొద‌ట్లో బెయిల్ ర‌ద్దు విష‌యంలో తాము ఎటువంటి కౌంట‌ర్ వేయ‌మ‌ని, మెరిట్ ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర్టుకు తెలిపింది. అయితే త‌రువాత మ‌ళ్లీ కౌంట‌ర్ వేస్తామ‌ని ప్ర‌క‌టించి స‌మ‌యం తీసుకుంది. రెండుసార్లు కౌంట‌ర్ వేయ‌డానికి సమ‌యం తీసుకున్న సీబీఐ మ‌ళ్లీ స‌మ‌యం కావాల‌ని కోర‌డంతో ర‌ఘురామ త‌రుపు న్యాయ‌వాది అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో.. తాము మొదట తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మెరిట్ ఆధారంగా కోర్టు నిర్ణ‌యం తీసుకోవాల‌ని తెలిపింది. దీంతో ఈ కేసు విష‌యంలో ఈ నెల 25న తుది తీర్పు రాబోతోంది. రానున్న కోర్టు తీర్పుపై అన్నివ‌ర్గాలు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ