అనుభవజ్ఞులైన వెటర్నరీ సర్జన్లను ఆహ్వానిస్తున్నాం :నగర కమిషనర్ మయూర్ అశోక్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు : గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణ కోసం చేపట్టిన యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ (ఏఆర్వీ) కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి జిఎంసి ఏబీసి సెంటర్ తో పాటు, గౌరవ వేతనం ప్రాతిపదికన సేవలందించడానికి ఆసక్తి కల్గిన ప్రైవేట్ వెటర్నరీ క్లినిక్స్ నిర్వహిస్తున్న అనుభవజ్ఞులైన వెటర్నరీ సర్జన్లను ఆహ్వానిస్తున్నామని నగర కమిషనర్ కె.మయూర్

అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం జిఎంసి పరిధిలో పొన్నూరు రోడ్డులోని జంతు సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న వీధి కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు మరింత ఎక్కువ సంఖ్యలో చేయడానికి గౌరవ వేతనం ప్రాతిపదికన సేవలందించడానికి ప్రైవేట్ వెటర్నరీ

క్లినిక్స్ నిర్వహిస్తున్న అనుభవజ్ఞులైన వెటర్నరీ సర్జన్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి గల వైద్యులు గుంటూరు నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగంలోని మెడికల్ హెల్త్ ఆఫీసర్ లేదా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (76758 33612)లను సంప్రదించి తమ సమ్మతి మరియు వివరాలను తెలియచేయాలని, అర్హులైన వారికి అవసరమైన సౌకర్యాలు, విధివిధానాలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలపై పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు.