పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన నవీన పాఠశాల.

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

గుంటూరు : ఉన్నత చదువులకు తొలి మెట్టైనా పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ అద్భుతమైన ఉన్నత చదువులు, చదువుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అనేక రంగాలలో ఉన్నాయని, సరైన ప్రణాళికతో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని మాజీ శాసన మండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక అమరావతి రోడ్డు నగరాలు విద్యా నికేతన్ హైస్కూల్ 10వ తరగతి ఫలితాలలో అద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థుల అభినందన సభ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న

మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అంకిత భావంతో నాలుగున్నర దశాబ్దాలుగా పేద వెనుకబడ్డ తరగతి పిల్లల విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చైర్మన్ చిన్నపరెడ్డి, కరస్పాండెంట్ చిన్నమ్మ దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ వై.చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు 124 మంది హాజరు కాగా వి.వెన్నెల 593, వి.హాసిని 593, డి.లక్ష్మీ అనన్య 592, బి.తీర్థన 592, టి.హర్షిత్ సూర్య 591, కె. సాయిరాం తేజ 591, వై. శ్రీనాథ్ 591, జే.సౌమ్య 591, ఎన్.యశ్వంత్ 590, డి.జెస్సి 590 మార్కులు పది

మంది విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. 550 మార్కులు 94 మంది విద్యార్థులు సాధించారని, ఇది ఆల్ టైం రికార్డుగా తమ పాఠశాల కీర్తి కిరీటంలో కలికిత్తురాయిగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపటం ద్వారా తమ పాఠశాల గత మూడు దశాబ్దాలుగా పదవ తరగతి ఫలితాలలో నూరు శాతం ఫలితాలు సాధిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై.చిన్నమ్మ, ప్రధానోపాధ్యాయులు వై. నవీన్ రెడ్డి, అంజిరెడ్డి విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.