రీ సర్వే పనులను వేగవంతం చేయాలి:కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల:రీ సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మండల రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశం మందిరంలో రైల్వే ప్రాజెక్టులు, 22 ఏ కేసులు, రి సర్వే పై సంబంధాధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు, వాటికి కావలసిన భూమికి సంబంధించి వివరాలను నిర్దేశిత గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ప్రతి అంశమునకు సంబంధించి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టులకు అనుమతులు వచ్చిన వాటిని వెంటనే పనులు ప్రారంభించాలని, అనుమతులు రాని వాటికి సంబంధించి నివేదికలను తయారు చేసి అనుమతులు పొందాలని ఆయన అధికారులకు తెలిపారు. జిల్లాలో ఎండ తీవ్రతలు అధికమవుతున్నందున ప్రతి పాఠశాలలో, కళాశాలలో, రైల్వే స్టేషన్లలోనూ బస్టాండ్ లోను, జనావాసాలు ఎక్కువగా ఉండే చోట చలివేంద్రాలను, తాటాకు పందిళ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. మండల రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని యూరియా మరియు డిఏపి ప్రక్క దారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ పై ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలనీ కలెక్టర్ ఎమ్మార్వో లను ఆదేశించారు.
పి జి ఆర్ ఎస్ కు వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టర్ వద్ద పరిష్కారం కానీ వాటిని ముఖ్యమంత్రి దగ్గరికి పంపుతున్నామని అర్జీదారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. అర్జీలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు వాటికి ఏ విధంగా ఎండార్స్మెంట్ చేస్తున్నారో తగు వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ఆయన మండల స్థాయి అధికారులకు సూచించారు. కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
జిల్లాలో 22 ఏ కింద వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మండల స్థాయి అధికారులకు పలు సూచన చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 16 సమావేశ నిర్వహించి 22 ఏ కేసులను పరిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రి సర్వేకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, వీక్షణ సమావేశం ద్వారా రైల్వే శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ, రేపల్లె బాపట్ల ఆర్డీవోలు శ్రీదేవి, పిగ్లోరియా మండల రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు, ఆర్ అండ్ బి ఏ ఈ లు, ందీ తదితరులు పాల్గొన్నారు.