శానిటేషన్ డ్రైవ్‌లపై ప్రత్యేక చర్యలు :ఎమ్మెల్యే అరవింద బాబు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

నరసరావుపేట టౌన్ :నరసరావుపేట మున్సిపాలిటీలో శానిటేషన్ డ్రైవ్ లపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో మున్సిపాలిటీ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని శానిటేషన్‌ను మెరుగుపరచడం మరియు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ముఖ్య లక్ష్యంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ

విభాగాల అధికారులతో ఎమ్మెల్యే అరవింద బాబు విభాగాల వారీగా సమీక్ష చేస్తూ పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, నరసరావుపేటను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగం సమీక్ష సందర్భంగా రోడ్డు మార్జిన్లపై జరుగుతున్న ఆక్రమణలను తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మంచినీటి సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా పైపులైన్ల నిర్వహణపై

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని, పరిశుభ్రమైన తాగునీటిని ప్రజలకు అందించాలని సూచించారు. మెప్మా విభాగం సమీక్షలో డ్వాక్రా మహిళా స్వయం సహాయక గ్రూపులకు రుణాల పంపిణీలో అవకతవకలు లేకుండా, అర్హులైన వారికి ఆలస్యం చేయకుండా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడానికి వివిధ పన్నులు, టాక్సులను సకాలంలో వసూలు చేసేలాగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అరవిందబాబు అధికారులను ఆదేశించారు.