కర్ణాటక కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్.. 20 మంది కొత్త మంత్రుల జాబితా ఖరారు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

బెంగళూరు, ఆగస్టు 3: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణకు పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రాంతీయ, సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని 20 మంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం త్వరలోనే జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించిన జాబితాలో పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాని, కె.ఎస్. బసవంతప్ప, బి. నాగేంద్ర, టి. రఘుమూర్తి, బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాళ వైద్య, డా. అజయ్ సింగ్, ఎన్. చలువరాయ స్వామి, కె.ఎం. శివలింగ గౌడ, హెచ్.సి. బాలకృష్ణ, గాయత్రి శాంతేగౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద కాశప్పనవర్, లక్ష్మణ సవాది పేర్లు ఉన్నట్లు సమాచారం.

అదే సమయంలో శాసనసభ, శాసన మండలిలో కీలక పదవులకు కూడా కాంగ్రెస్ నాయకత్వం ఆమోదం తెలిపింది. శాసనసభ స్పీకర్‌గా జి.ఎస్. పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏ.ఎస్. పొన్నన్న పేర్లు ఖరారయ్యాయి. అలాగే శాసన మండలి చైర్‌పర్సన్‌గా సలీం అహ్మద్, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉమాశ్రీ పేర్లకు కూడా ఆమోదం లభించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కుల, ప్రాంతీయ సమతుల్యతతో పాటు అనుభవం, కొత్త నాయకత్వానికి సముచిత ప్రాధాన్యం కల్పించేలా ఈ కేబినెట్ విస్తరణ చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.