WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఫైనల్‌లో పివి సింధు....!

తెలుగమ్మాయి పివి సింధు రియో ఒలింపిక్స్‌లో దుమ్మ దులిపింది. గురువారం నాడు మహిళల బ్యాట్మింటన్‌ సెమీ ఫైనల్‌లో జపాన్‌ క్రీడాకారణి నోజోమీ ఒకుహారాను 'సింధు' చిత్తు చిత్తుగా ఓడించి సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టి భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. ఫైనల్‌లో 'సింధు' గెలిస్తే స్వర్ణం...ఓడితే రజతం తప్పకుండా భారత్‌కు వస్తుంది. తద్వారా బ్యాట్మింటన్‌లో తొలిసారి భారత్‌కు రజితం సాధించిన క్రీడాకారిణిగా 'సింధు' చరిత్ర సృష్టించనుంది. కాగా సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 'సింధు' జపాన్‌ క్రీడాకారిణి నోజోమీ ఒకుహరాకు చుక్కలు చూపించింది. తొలి సెట్‌ హోరా హోరిగా జరిగినా, రెండు సెట్‌లో 'సింధు' విశ్వరూపం చూపించింది. బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లు, ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌లతో 'నోజోమీ'ని గుక్క తిప్పుకోనివ్వలేదు. తొలి సెట్‌ గెల్చుకున్న ఆత్మవిశ్వాసంతో రెండో సెట్‌ను దూకుడుగా ప్రారంభించింది సింధు. తొలి అర్థభాగంలో 11-10 అధిక్యంతో రెస్ట్‌కు వెళ్లిన 'సింధు' అనంతరం 'జపాన్‌' క్రీడాకారిణికి మరో పాయింట్‌ రాకుండా మ్యాచ్‌ ముగించింది.

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ