WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కన్నీళ్లు పెట్టుకున్న 'ముద్రగడ'...!

కాపులను బిసీల్లో చేర్చాలని ఉద్యమం చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నీరు పెట్టుకున్నారు. తాను అనాధను అని, కాపులను బిసీల్లో చేర్చే వరకు తాను అనాధగానే భావిస్తానని ఆయన చెప్పుకున్నారు. కాపు జెఏసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఆమరణ నిరాహారదీక్ష చేసినప్పుడు లోకేష్‌ ఆదేశాలతో పోలీసులు నన్ను, నా భార్యను పిల్లలను కొట్టారు. తీవ్రంగా వేధించారు. నేను మానసికంగా బాధపడ్డాను. ఈ బతుకెందుకని భావించానని కంటతడి పెట్టుకున్నారు. ఎన్ని బాధలుపడ్డా ఈ జాతికి మేలు చేయాలని ముందుకు వచ్చాను. కొందరు కేసులకు భయపడుతున్నారు. భయపడేవారు ఉద్యమాలకు రావద్దు. రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమం ఆగదని ఆయన అన్నారు.

(136)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ