WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నంబర్‌వన్‌ ఇండియా...!

ఐసిసి టెస్టు క్రికెట్‌ ర్యాకింగ్‌లో మళ్లీ భారత్‌ నంబర్‌వన్‌ స్థానం సాధించింది. కోలకతాలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఘన విజయం సాధించడం ద్వారా భారత్‌ ఈ ఘనత సాధించింది. ఐసిసి ర్యాంకింగ్‌లో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న పాకిస్తాన్‌ను భారత్‌ రెండోస్థానానికి నెట్టివేసింది. 376 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్సింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ భారత్‌ బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించింది. మొదటి వికెట్‌కు ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ గుప్తిల్‌,లాథమ్‌ 55 పరుగులు జోడించి గట్టిగానే ఇన్సింగ్‌ ప్రారంభించారు. గుప్తిల్‌(24) లాథమ్‌ భారత్‌ బౌలర్లును సునాయాసంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ఇన్సింగ్‌ను నడిపించారు.అయితే గుప్తిల్‌ను అశ్విన్‌ అవుట్‌ చేసి వికెట్ల పతనానికి నాందిపలికాడు.అనంతరం 'లాథమ్‌' నిఖిహాల్‌ రెండో వికెట్‌కు అర్థసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడిని 'జడేజా' విడదీశారు.అనంతరం న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 'లాథమ్‌' (74) పరుగులు చేశాడు. నాల్గవ రోజు చివరి ఓవర్‌ మొదటి బంతికి న్యూజిలాండ్‌ ఆఖరి వికెట్‌ కోల్పోయింది.దీంతో భారత్‌ 178 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ మొదటి ఇన్సింగ్స్‌లో 316 పరుగులు చేయగా న్యూజిలాండ్‌ తొలి ఇన్సింగ్‌లో 204 పరుగులు చేసింది. భారత్‌ రెండవ ఇన్సింగ్స్‌లో 263 పరుగులు చేయగా న్యూజిలాండ్‌ 197పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌ బౌలర్లల్లో భువనేశ్వర్‌కుమార్‌ ఐదు వికెట్లు తీయగా సమీ 6 వికెట్లు, అశ్విన్‌ 4 వికెట్లు,జడేజా4 వికెట్లు సాధించారు. కాగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వికెట్‌ కీపర్‌ వృద్దీమాన్‌ సాహాకు దక్కింది. మొదటి ఇన్సింగ్స్‌లో 54 నాటౌట్‌, రెండో ఇన్సింగ్స్‌లో 58 నాటౌట్‌ సాధించిన సాహాకు ఈ అవార్డు దక్కింది.

(175)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ