WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బాలకృష్ణ కుటుంబసభ్యులపై ఐటి సోదాలు...!

ప్రముఖ నటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులను ఐటి అధికారులు సోదాలు చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో బాలకృష్ణ బంధువులు భారీ ఎత్తున నల్లధనాన్ని తీసుకువెళుతున్నారన్న సమాచారంతో ఐటి అధికారులు వారి కుటుంబ సభ్యులను సోదా చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి పది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ రద్దు చేసిన నోట్లు కావడం విశేషం. కాగా ఈ నోట్లను తాము స్వామి వారి హుండీలో వేయడానికి తీసుకెళ్తున్నట్లు వారు చెప్పారు. దాంతో ఈ డబ్బుపై విచారణ జరిపిన తరువాత ఐటి అధికారులు ఆ డబ్బును తిరిగి వారికి అప్పగించారు. ఈ విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

(231)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ