WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వామ్మో...అవినీతి అంతం 'ప్రతిజ్ఞా'...?

ఇటీవల అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఒకరు తమ సిబ్బంది అందర్ని పిలిచి కనీసం ఒక నెల వరకు అయినా లంచాలు తీసుకోమని ప్రమాణం చేయాలని కబురు పంపారు. ఆ కబురు అందుకున్న వారిలో అతి కొద్దిమంది మాత్రమే కలెక్టర్‌ వద్దకు వచ్చి ప్రమాణం చేశారు. మిగతా వారెవరూ ఈ ప్రమాణ కార్యక్రమానికి హాజరు కాలేదు. చిత్ర,విచిత్రమైన ఈ స్పందనకు కలెక్టర్‌ ఆశ్చర్యపోయి కంగుతిన్నారు. విచిత్రమేమిటంటే...ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన వారిలో 80శాతం మంది అవినీతి ఆరోపణలు ఉన్నవారేనట...ముఖ్యంగా ఎంపిడిఓలు తక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారట. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞను అందరూ చేస్తున్నారని తాను అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటున్నానని కనీసం ఈ నెల రోజులు అయినా అవినీతికి పాల్పడకుండా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారేమోనని ఆశించానని ఆ కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

     ఈ కార్యక్రమం మన తెలుగు రాష్ట్రంలోని 'పశ్చిమగోదావరి' జిల్లా కలెక్టర్‌ 'కాటంనేని భాస్కర్‌' జాయింట్‌ కలెక్టర్‌ కోటేశ్వరరావులు అత్యంత నిజాయితీపరులుగా పేరు తెచ్చుకున్నారు. ఈ జిల్లాలో అధికార అవినీతిని తగ్గించడంలో కలెక్టర్‌ భాస్కర్‌ ఎంతో కృషి చేసినా...రాజకీయ అవినీతిని అంతంత మాత్రమే తగ్గించారని ప్రత్యర్థులు విమర్శిస్తారు. తాను అధికారులను, ఉద్యోగుల అవినీతిని మాత్రమే తగ్గించగలుగుతానే తప్ప మిగతా రాజకీయ వ్యవహారాల్లో నాకేమీ సంబంధం అని కలెక్టర్‌ చెబుతున్నారు. అంతకు ముందు ప్రతిజ్ఞ చేసేందుకు సమావేశానికి వచ్చిన ఎంపిడిఓలు ఇతర అధికారుల్లో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

    ఒక నెలరోజులు లంచాలు తీసుకోకండి...నిజాయితీగా బాధ్యతలు నిర్వహించండి, సకాలంలో కార్యాలయానికి రండి..అని కలెక్టర్‌ కోరితే..అధికారులు ఆ విధంగా వ్యవహరించారంటే రాజకీయవర్గాల అండదండలు వారికి ఉన్నాయని స్పష్టంఅవుతుంది. కృష్ణా జిల్లాలో రాజకీయ, అధికార అవినీతి తక్కువగా ఉందని, పశ్చిమగోదావరి జిల్లాలో అధికార అవినీతి కన్నా రాజకీయ అవినీతి రెట్టింపుగా ఉందని ఇప్పటికైనా కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు కళ్లు తెరిసి కృష్ణా జిల్లా ఉద్యోగులతో పోటీ పడి లంచాలు తీసుకోకుండా ఉద్యోగాలు చేయాలని కొందరు అధికారులు పదే పదే చెబుతున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా, రక్తానికి అల‌వాటు పడ్డ పులి ఏ విధంగా తన అల‌వాటు మార్చుకోదో...లంచాలకు అపడ్డ ఉద్యోగులు అంత ఈజీగా మనసు మార్చుకుంటారా..?

(133)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ