WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సూరి' దర్శకత్వంలో 'అఖిల్‌' సినిమా...!

'అక్కినేని నాగార్జున' తన రెండో కుమారుడు 'అఖిల్‌' కెరీర్‌ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్‌ చేసినా తీవ్ర నిరాశపరుస్తున్నాడు 'అఖిల్‌'. దీంతో 'నాగార్జున' రెండో సినిమా మొదలు పెట్టాలంటేనే భయపడిపోతున్నాడు. దీంతో 'అఖిల్‌' తన మిత్రుడు 'రామ్‌చరణ్‌' శరుణ కోరాడట. దీంతో దర్శకుడు సురేందర్‌రెడ్డితో 'అఖిల్‌' సినిమాను ప్లాన్‌ చేస్తున్నారట 'చరణ్‌'. రీమేక్‌ సినిమా అయిన 'ధృవ' కూడా అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు సూరి. అందుకే ఆయనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట అఖిల్‌. ఇంతకీ ఈ సినిమాను నిర్మించేది ఎవరో తెలుసా? మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌. చరణ్‌, అఖిల్‌లు మంచి స్నేహితులు. 'ఖైదీ నెంబర్‌ 150' తర్వాత కూడా తాను నిర్మాతగా కొనసాగుతానని చెర్రీ ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.

(222)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ