WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముదురు బెండకాయలు...!

బెండకాయ ముదిరిపోయినా...వయస్సు మళ్లి పోయినా పనికి రాదంటారు..పెద్దలు...! సాధారణ 'జనం' సంగతి ఏమో కానీ...సినిమా హీరోయిన్లు కొందరు కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పెళ్లి వయసు దాటి పోతున్నా ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అటువంటి వారిలో తెలుగు సినీపరిశ్రమలో ముగ్గురు హీరోయిన్లు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

   వీరిలో మొదట చెప్పుకోవాల్సింది 'జేజమ్మ' 'అనుష్క' గురించి. ఆమెకు ఇప్పుడు దాదాపు 35 ఏళ్లు వచ్చేస్తున్నాయట. అయినా ఇంకా ఇప్పుడు...అప్పుడు అంటూ పెళ్లి వాయిదా వేస్తూ వస్తోంది. మొన్నామధ్య ఓ సీనియర్‌ నిర్మాతను పెళ్లి చేసుకోబోతోందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు కోడై కూశాయి. ఇంతకు ముందే పెళ్లి అయిన సదరు నిర్మాత ఇటీవలే తన కుమార్తె వివాహం జరిపించారట. అటువంటి సీనియర్‌ నిర్మాతను 'అనుష్క' పెళ్లి చేసుకోబోతోందని వార్తలు రావడంతో 'పాపం..అనుష్క'కు ఎటువంటి గతి పట్టిందో అని వాపోయారు ఆమె అభిమానులు. ఎందుకంటే సదరు నిర్మాత వయస్సు దాదాపు 70 దగ్గర్లో ఉన్నాడు మరి. తెలుగు సినీ హీరోల్లో ప్రముఖుడైన ఓ హీరో వీరి పెళ్లి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. ఒకప్పుడు 'అనుష్క' ఆయన ఆధీనంలోనే ఉంది. సదరు నిర్మాత, ఈ హీరో ఇద్దరు మంచి స్నేహితులు. తన స్నేహితుడైన నిర్మాత కోరిక తీర్చడానికి హీరోగారు 'అనుష్క'తో పెళ్లి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే చివరి నిమిషాల్లో సదరు నిర్మాత బంధువుల నుంచి, అతని కుమార్తె నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిందట. ఈ వయసులో ఇదేం పని...అంటూ మందలించారట. దీంతో ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉండిపోయారట. దాంతో 'అనుష్క' తల్లిదండ్రులు మరో వరుడి కోసం వెతుకుతున్నారట. పెళ్లి విషయం ఇలా ఈ అమ్ముడు వరుసగా సినిమాలతో దూసుకపోతోంది. బాహుబలి-2, 'నమో వెంకటేశాయ', 'భాగమతి' సినిమాలతో బిజీగా ఉంది ఆమె. మొత్తం మీద ఇప్పట్లో 'అనుష్క'కు పెళ్లి అయ్యే ఛాన్స్‌ లేదని సినీ వర్గాల అభిప్రాయం. 

  మరి ఇదే కోవలో మరో హీరోయిన్‌ ఉంది. ఆమే 'త్రిష'. ఈమెకు దాదాపు 33 సంవత్సరాలు వచ్చాయట. ఆ మధ్య ఎవరితోనే నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి తేదీని ప్రకటించింది. అయితే తరువాత అది ఎందుకో బెడిసికొట్టింది. పెళ్లి కొడుకు పెట్టిన కండిషన్లకు 'త్రిష'కు దిమ్మ తిరిగిందట. దీంతో 'పెళ్లి వద్దూ..పెటాకులూ వద్దూ...' అంటూ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిందట. 

  ఇక మరో ముదిరిపోయిన బెండకాయ 'నయనతార' ఈమెకు కూడా 35+. ఎందరో హీరోలతో ఎఫైర్‌ పెట్టుకుని పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగిపోయింది. గతంలో 'ప్రభుదేవా'ను రెండో పెళ్లి చేసుకోవాలని భావించి అంతా సిద్ధం చేసుకుంది. కానీ పెళ్లిపీటల వరకు వెళ్లలేకపోయింది. తరువాత 'శింబు'తో వ్యవహారం చెడిపోయింది. ఇప్పుడు దర్శకుడు 'విఘ్నేష్‌'తో పీకలదాకా ప్రేమలో ఉందట. ఈయనతో రేపో మాపో పెళ్లి జరుగుతుందని ఒకటే హడావుడి ప్రకటనలు చేస్తోంది.మరి ఇదెక్కడి ఆగిపోతుందోనని  అంటున్నారు ఆమె సన్నిహితులు.

(1139)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ