WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లాలూకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

 లాలూ ప్రసాద్ యాదవ్‌కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 900 కోట్ల దాణా కుంభకోణంలో ప్రతికేసు పైనా విడివిడిగా విచారణ జరపాలన్న సీబీఐ అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. లాలూకి క్లీన్ చిట్ ఇస్తూ గతంలో జార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పును సైతం సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై సీబీఐ ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేయడంపైనా సుప్రీం సీరియస్ అయింది. వచ్చే 9 నెలల్లోగా ప్రత్యేక కోర్టులో విచారణపూర్తిచేయాలనిఆదేశించింది.సుప్రీంకోర్టు పనివేళలు ప్రారంభమైన కొద్ది సేపటికే జస్టిస్‌ అమితావ్‌ రాయ్‌, జస్టిస్‌ పీసీ ఘోష్‌లతో కూడిన ధర్మానం తీర్పు వెల్లడించింది. ఈ కేసును ’అత్యంత ప్రాధాన్యమైనది’గా భావించాలని సీబీఐ చీఫ్‌కు సూచించిన న్యాయస్థానం.. 9 నెలల్లోగా దాణా కుంభకోణం కేసులన్నింటి విచారణను పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1990ల్లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సీఎంగా ఉన్నప్పుడు దాణా కుంభకోణం జరిగింది. దీనిపై దాఖలైన పలుకేసుల్లో విడివిడిగా విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు... ఓ కేసుకు సంబంధించి 2013లో లాలూను నిందితుడిగా తేల్చింది. ఐదేళ్లపాటు జైలు ఆయనకు శిక్ష విధించింది. దీంతో లాలూ 11 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలన్ని కోల్పోయారు. నాటి తీరపును సవాలు చేస్తూ లాలూ జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో జార్ఖండ్‌ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఐపీసీ సెక్షన్‌ 120, 120B, 409, 420, 471, 477, 477A, 13(2)ల కింద సీబీఐ లాలూపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పిటిషన్‌ విచారణకు నేడు కోర్టు అంగీకారం తెలిపింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో లాలూపై విచారణ జరిపేందుకు సుప్రీం తాజాగా అనుమతించింది.

 

(227)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ