WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అడ్జ‌స్ట్ అనే పదానికి అర్థం లొంగిపోవ‌డమ‌నేనా?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి గురించి ఇటీవ‌లి కాలంలో చాలామంది హీరోయిన్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. నిర్మాత‌ల‌ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలా మంది చెప్పారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతుంద‌ని కూడా చెప్పారు. అలాంటి వేధింపులు చాలా ఎదుర్కొన్నామని కూడా కొంతమంది హీరోయిన్లు వెల్ల‌డించారు. ఈ వ్య‌వ‌హారంపై సీనియర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ తొలిసారి స్పందించింది.ఈ వ్య‌వ‌హారంపై త‌న స్పంద‌న‌ను బోల్డ్‌గా చెప్పిన ర‌మ్య‌కృష్ణ ఇత‌ర రంగాల మాదిరిగానే సినిమా ఇండ‌స్ట్రీలోనూ అడ్జ‌స్ట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి అని చెప్పింది. అంతేకాకుండా అలా అడ్జ‌స్ట్ అయిన హీరోయిన్లే కెరీర్‌లో ముందుకు వెళ‌తార‌ని కూడా బోల్డ్‌గా చెప్పేసింది ర‌మ్య‌. అయితే అడ్జ‌స్ట్ అవ‌డంకాక‌పోవడం అనేది వారి వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను బ‌ట్టి ఉంటుంద‌నిఅయితే అలా అడ్జ‌స్ట్ అయిన వారు మాత్ర‌మే ముందుకు వెళ‌తార‌ని చెప్పింది. ఇక్క‌డ ర‌మ్య‌కృష్ణ ఉప‌యోగించిన అడ్జ‌స్ట్ అనే పదానికి అర్థం ఇంత‌కుముందు ఇత‌ర హీరోయిన్లు చెప్పినట్టుగా సినీ పెద్ద‌ల‌కు లొంగిపోవ‌డమ‌నేనా?

(154)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ