WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలుగువాళ్లం ఒకటే: వెంకయ్య

 రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లం ఒకటేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు .పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. సామరస్య పూర్వక వాతావరణంలో ఉద్యోగుల విభజనఆస్తుల పంపిణీ చేసుకోవాలన్నారు. ఏకీకృత సర్వీసుల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులుఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో తాను మాట్లాడానని త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఇతర అంశాల్లోనూ అదే స్ఫూర్తి కొనసాగించాలని హితవు పలికారు.

(160)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ