భాజపా అగ్రనేతలకు వూరట 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భాజపా అగ్రనేతలకు వూరట

 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేతలకు వూరట కలిగింది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ 12 మంది నిందితుల‌కు సీబీఐ ప్ర‌త్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీళ్లంద‌రికీ రూ.50 వేల సొంత పూచీక‌త్తుపై బెయిల్ జారీ చేశారు. బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్‌కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భార‌తి.. ఇవాళ కోర్టు ముందు హాజ‌ర‌య్యారు. గ‌త నెల‌లో వీళ్ల‌పై ఉన్న కుట్ర కేసును సుప్రీంకోర్టు తిర‌గ‌దోడిన విష‌యం తెలిసిందే. రెండేళ్ల‌లో ఈ కేసు విచార‌ణ పూర్తి చేయాల‌ని లక్నో సీబీఐ స్పెష‌ల్ కోర్టుకు సుప్రీం ఆదేశించింది. 

 దీనిపై విచార‌ణ‌లో భాగంగా ఇవాళ కోర్టులో హాజ‌రు కావాల‌ని ఈ ముగ్గురు నేత‌ల‌కు కోర్టు స్ప‌ష్టంచేసింది. ఇందులో మిన‌హాయింపులు కూడా ఏమీ లేవ‌ని చెప్ప‌డంతో అద్వానీతోపాటు మిగ‌తా ఇద్ద‌రు నేత‌లు కూడా ప్ర‌త్యేక కోర్టుకు వ‌చ్చారు.అభియోగాలపై కేసు నమోదు చేసేందుకు నిందితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. కాగా.. భాజపా నేతలపై కేసులను వెనక్కి తీసుకోవాలంటూ వారి తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

(360)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ