WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి కడియం

వ‌రంగ‌ల్ జూన్ 2:: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి గౌర‌వ వంద‌నం స్వీక‌రించిన త‌ర్వాత ఆయ‌న వేదిక‌పై మాట్లాడేందుకు వెళ్లారు. ప్ర‌సంగం చేస్తున్న‌ సమయంలో మంత్రి కడియం కళ్లు తిరిగి కింద పడిపోయారు. ఉదయం నుంచే ఎండ వేడిమి అధికంగా ఉండటంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది ఆయన్ని వెంటనే లేపి పక్కన కూర్చోబెట్టారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది.

(281)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ