WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అద్దంకి'లో సత్తా చూపబోతున్న 'గొట్టిపాటి'...!

'అద్దంకి' నియోజకవర్గంలో మంత్రి లోకేష్‌ చేపడుతున్న పర్యటనకు భారీ ఎత్తున్న జనసమీకరణ చేయడానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి 'గొట్టిపాటి రవే'నని, ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయనపై ఓడిపోయిన కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌లు ఈ నియోజకవర్గంలో చేయిపెట్టవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పడో ఆదేశించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులను, స్థానిక సంస్థల ప్రతినిధులను కలుపుకుని సత్తా చూపించేందుకు ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి పూర్తి అధికారం ఇచ్చిన 'చంద్రబాబు' నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకు అన్ని వర్గాలను కలుపుకుపోతూ భారీ జనసమీకరణ కోసం 'గొట్టిపాటి' ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలను కూడా భారీ ఎత్తున తరలించేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమానం పొందడమే కాకుండా సుమారు ఐదువేల అదనపు పెన్షన్లు విడుదల చేయించిన ఘనత 'గొట్టిపాటి'దే. ఎటువంటి కవ్వింపు చర్యలకు ఎవరైనా పాల్పడినా, ఇబ్బందులు పెట్టినా, ఆవేశపడవద్దని ఇప్పటికే 'రవి' తన సహచరులను ఆదేశించారు. ఈ రోజు జరగనున్న 'లోకేష్‌' సభకు 'కరణం' వర్గీయులు సహకరిస్తారా...? మరేమి చేస్తారా...? అనే విషయంపై ఆందోళన చెందనక్కర్లేదని, ఇప్పటికే మంత్రి లోకేష్‌ ఎవరెవరికి ఏ సందేశాలు పంపాలో పంపారని 'రవి' వర్గీయులు చెబుతున్నారు. తండ్రి చంద్రబాబును మెప్పించాను..తనయుడు 'లోకేష్‌'ను మెప్పించి 'అద్దంకి' నియోజకవర్గంలో తాను తప్ప వేరే వారు ఎవరూ చేయరనే విధంగా చేయాలని 'రవి' భావిస్తున్నారు. ఎటువంటి గొడవలు జరిగే అవకాశం లేవని, తామందరం సమన్వయంతో పనిచేస్తున్నామని ఆయన అభిమానులు చెబుతున్నారు.

(313)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ