WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మాణిక్యాలరావు' ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి...!

అధిష్టానం ఆదేశిస్తే...ఐదు నిమిషాల్లో మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. ఈ రోజు విజయవాడలో జరిగిన బిజెపి విస్తృత స్థాయి సమావేశంలో..ఆయన ఆవేశంగా రాజీనామాపై మాట్లాడారు. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను టిడిపి అవమానిస్తుందని...అందుకే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే..దీనిపై పార్టీలో చర్చించాలని..తరువాతే..ఆయన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని సహచరనేతలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ..తాను రాజీనామాపై నిర్ణయం తీసుకున్నానని రాజీనామా చేస్తానని ఆయన పట్టుపడుతున్నారట. కాగా మంత్రి మాణిక్యాలరావు ప్రకటనపై టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. మంత్రికి దమ్ముంటే..మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

  గత ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి కాక ముందు ఆయన ఆస్తులు ఎన్ని..ఇప్పుడు మంత్రిగా ఆయన ఆస్తులు ఎన్ని అనే దానిపై ఆయన చర్చకు రావాలని టిడిపి నేతలు సవాల్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తమ దయతో ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారని, ఇప్పుడు...ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి పార్టీ తరుపున పోటీ చేయాలని..అప్పుడే ఆయన సత్తా...ఆయన పార్టీసత్తా బయటకు వస్తుందని వారు అంటున్నారు. మొత్తం మీద..మంత్రి పదవితో పాటు..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఉప ఎన్నికల్లో బిజెపి సత్తా..చూపించాలని నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి మాణిక్యాలరావు సిద్ధంగా ఉన్నారా..?


(1309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ