WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీటీడీ సభ్యత్వం కోసం పైరవీలు...!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ పదవిని పూరించడంతో సభ్యుల పదవి కోసం పార్టీలోని సీనియర్‌ నేతలు ఆ పదవి దక్కించుకునేందుకు 'చంద్రబాబు,చినబాబు'లతో పాటు ఇతర ప్రముఖులను కలసి తమ పేరును సిఫార్సు చేయాలని కోరుతున్నారు. తెలంగాణ కోటాలో ఇద్దరి నుండి ముగ్గురిని సభ్యులుగానియమించే అవకాశాలు ఉన్నాయి. గతంలో టీటీడీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించిన ఎమ్మెల్యే వీరయ్య మళ్లీ అదే పోస్టు తనకు దక్కడం ఖాయమని భావిస్తున్నారు. ఆయన ఆ పదవి కోసమే పార్టీలో కొనసాగుతున్నారని విమర్శించేవారు ఉన్నారు. ఈ పదవి కోసం ఇప్పటికే పలువురు ధరఖాస్తు చేసుకున్నారు. వారిలో కెటిఆర్‌ను ఇతర నాయకులను..తనదైన శైలిలో విమర్శిస్తూ...అనేక సందర్భాల్లో...ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పించిన 'నున్నూరి నర్సిరెడ్డి' ఆ పదవిని కోరుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెన్‌ శ్రీనివాసరావు తనకు దళిత కోటాలో ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వస్తే..కులాల వారీగా...ఆ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. గత ముప్పయి సంవత్సరాలుగా పార్టీలో ఉన్న సీనియర్‌ నేతలను ఈసారి బోర్డులో సభ్యులుగా నియమించాలని చంద్రబాబు,చినబాబులపై ఒత్తిడి వస్తుంది. తాడికొండ నియోజకవర్గం ఫిరంగపురం మండలం అమీనాబాద్‌ 'బత్తుల ప్రసాద్‌ చౌదరి'కి టిటిడి సభ్యునిగా నియమించాలని కొంత మంది జిల్లా నాయకులతో పాటు అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కూడా సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా ఇంధనశాఖ మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు కూడా ఇద్దరి ముగ్గురి పేర్లను కులాల వారీగా సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి నారా లోకేష్‌ కూడా తన సన్నిహితులైన ఇద్దరు ముగ్గురికి టిటిడి సభ్యత్వం ఇప్పించాలని భావిస్తున్నారు. ఈసారి బిజెపి మరియు పవన్‌ సిఫార్సులు లేకపోవడంతో..మరో ఇద్దరు ముగ్గురు టిడిపి నేతలకు ఆ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్‌అఫియోషియో సభ్యులుగా దేవాదాయశాఖ కార్యదర్శి మరియు కమీషనర్‌లతో పాటు మరో ఇద్దరు రిటైర్డ్‌ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కులాలు, ప్రాంతాలు, జిల్లాలను పరిగణలోకి తీసుకుని ఈ మాసాంతంలోగా..పూర్తి స్థాయి బోర్డును నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

  సిఎంఒ కార్యాలయ అధికారులు కూడా...తమకు సన్నిహితులైన కొంత మందికి సభ్యత్వం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. సిఎంఒలో దేవాదాయశాఖను పర్యవేక్షించే 'సతీష్‌చంద్ర'ను మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు లిఖిత పూర్వకంగా ధరఖాస్తులు ఇచ్చారు. నాదేమీ లేదు...సిఎం చంద్రబాబు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు..ఆయనను స్వయంగా కలవండి...అని ఆయన చెబుతున్నారు. సిఎంఒలో పనిచేసే సాయిప్రసాద్‌, రాజమౌళిలు కూడా తమ సన్నిహితులకు సిఫార్సు చేస్తున్నారట. ఒక్కసారి టిటిడి సభ్యునిగా నియమిస్తే...రెండేళ్ల వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు...బంధుమిత్రులకు, సన్నిహితులకు విఐపి దర్శనాలు చేయించవచ్చు... కాంట్రాక్టులు పొందవచ్చు...! గతంలో సభ్యులుగా ఉన్న వారు...శ్రీవారి టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఏదో విధంగా టీటీడీ సభ్యత్వం లభిస్తే...ఆర్థికంగా, రాజకీయంగా వెసులుబాటుగా ఉంటుందనే భావన ఎక్కువ మంది నాయకుల్లో ఉంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కసారి మాత్రమే ఎన్నికల్లో ఓడిపోయిన 'నారాయణస్వామి'ని టీటీడీ సభ్యునిగా నియమించే అవకాశం ఉంది. కానీ..ఆ జిల్లాకు చెందిన 'అశోక్‌గజపతిరాజు' అంగీకరిస్తేనే... 'నారాయణస్వామి'కి అవకాశం ఇస్తారు. కొంత మంది సీనియర్‌ మంత్రులను టిటిడి సభ్యులుగా ఎవరినైనా సిఫార్సు చేశారా..అని ప్రశ్నించగా..ఇంతవరకు చేయలేదని...స్వయంగా కలసి కొన్ని పేర్లు చెబుతామని చెప్పారు. దేవాదాయశాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తన కుటుంబసభ్యుల్లో ఒకరికి టిటిడి సభ్యత్వం ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది. ఇంత గందరగోళాల మధ్య టిటిడి సభ్యులను ఏ విధంగా ముఖ్యమంత్రి నియమిస్తారో..ఈ మాసాంతానికి కాని బయటకు రాదు.

(202)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ