లేటెస్ట్

నూతన సిఎస్‌గా 'నీలం సహానీ' నియామకం...!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిణి 'నీలం సహానీ'ని ప్రభుత్వం నియమించింది. ఆమెను నూతన సిఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖలో కార్యదర్విగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆమె ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. దీంతో 'సహానీ'ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. ఇటీవల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం'ను ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం 'నీరబ్‌కుమార్‌' ఇన్‌ఛార్జి సిఎస్‌గా పనిచేస్తున్నారు. 'సహానీ'ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో..ఇన్‌ఛార్జి సిఎస్‌గా ఉన్న 'నీరబ్‌కుమార్‌' ఎప్పటి వలే సిసిఎల్‌కే పరిమితం అవుతారు. ప్రభుత్వ నూతన సిఎస్‌గా నియమితులైన 'నీలం సహానీ' భర్త 'అజయ్‌ సహానీ' కూడా ఐఎఎస్‌ అధికారే. ఆయన కూడా కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం సిఎస్‌గా నియమితులైన 'సహానీ' వచ్చే ఏడాది ఆగస్టు వరకు పదవిలో కొనసాగుతారు. 

(451)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ