WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణ అసెంబ్లీ రద్దు...!

మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసిన కెసిఆర్‌

ముందే ఊహించినట్లు...తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ...కెసిఆర్‌ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ నర్సింహ్మన్‌కు అందజేశారు. అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి కెసిఆర్‌ గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వారంతా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి ఊరేగింపుగా తెలంగాణా భవన్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించి అసెంబ్లీ రద్దుకు గల కారణాలను వివరించబోతున్నారు. మొత్తం మీద తెలంగాణలో కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.సార్వత్రిక ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు సమయం ఉన్నా..ముందే ఎన్నికలకు వెళ్లాలని కెసిఆర్‌ నిర్ణయించుకోవడంతో..తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది.

(291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ