WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కృష్ణా వైకాపాలో ముసలం...!

'మూలిగే నక్కపై తాడిపండు'...అంటే ఇదే...! జిల్లాలో ఒకవైపు పోటీ చేయడానికి నాయకులు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే... మరో వైపు ఉన్న నాయకులు పెట్టేబేడా సర్దుకుని..ఇతర పార్టీల్లోకి జంప్‌ చేయడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు....వైకాపా అగ్రనేతలకు కంటిమీద కునుకు రానీయడం లేదు. జిల్లాలో బలహీనంగా ఉన్న వైకాపా..ఇప్పుడు జంపింగ్‌లు తీవ్ర ఇబ్బందిని తెచ్చిపెట్టబోతున్నాయి. కీలకమైన నియోజకవర్గాల్లో పోటీకీ ఎవరూ ముందుకు రాకపోవడం, ఉన్న నాయకులను సొమ్ములు తెమ్మని...అధినేత 'జగన్‌' పీడిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఇద్దరు సీనియర్‌ నాయకులు వైకాపాను వీడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో...ఆయన మరణం తరువాత..వైకాపాలో చేరిన సీనియర్‌ నేత 'కొలుసు పార్థసారధి, జోగి రమేష్‌'లు ఇప్పుడు ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారట. తాము కోరిన సీట్లు ఇవ్వమంటే...ఎంత ఇస్తారని..వారిని ప్రశ్నిస్తున్నారని...దాంతో..సొమ్ములు ఇచ్చి...తాము పోటీ చేయలేమని..ఆ ఇద్దరు నేతలు..వేరే పార్టీకి జంప్‌ కావడానికి సిద్ధం అవుతున్నారని కృష్ణా జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే..వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం జిల్లా పార్టీని ఒక కుదుపు కుదిపింది. రాష్ట్రంలో కీలక సామాజికవర్గానికి చెందిన 'రాధాకృష్ణ'కు విజయవాడ సెంట్రల్‌ సీటు  ఇస్తారని మొన్నటి వరకు ప్రచారం జరగడంతో...ఆయన తనకు ఆ సీటు ఖాయమనే భావనతో ఉన్నారు. అయితే..హఠాత్తుగా..ఆయనకు ఆ సీటు ఇవ్వమని...మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయమని అధినేత 'జగన్‌' చెప్పడంతో...ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇన్నాళ్లూ తాను సెంట్రల్‌లో పనిచేశానని..ఇప్పుడు 'మచిలీపట్నం' ఎలా వెళతానని..ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో..ఆయన అనుచరులు విజయవాడలో రభస సృష్టించారు. ఆయనను బుజ్జగించడానికి కొంత మంది సీనియర్‌ నేతలను పంపినా...ఆయన ఇంకా మెత్తపడలేదు. పార్టీలో ఉండాలనుకుంటే...మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని లేకుంటే.. .వెళ్లిపోవచ్చునని...'జగన్‌' ఆయన విషయంలో క్లారిటీ ఇచ్చారని...దీంతో..'రాధాకృష్ణ' నేడో..రేపో..నిర్ణయం తీసుకుంటారని... ఆయన 'జనసేన'లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 'రాధాకృష్ణ' వ్యవహారం ఇలా ఉంటే ఇప్పుడు 'పార్థసారధి, జోగి రమేష్‌'లు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారట.

  బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలను 'జగన్‌' చిన్నచూపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో 'పెనమలూరు' నుంచి గెలిచిన 'పార్థసారధి'కి 2014 ఎన్నికల్లో అక్కడ టిక్కెట్‌ ఇవ్వకుండా 'మచిలీపట్నం' పార్లమెంట్‌ స్థానం నుంచి 'జగన్‌' పోటీ చేయించడంతో...ఆయన అక్కడ ఓటమి చెందారు. దీంతో..ఇప్పుడు తనకు మళ్లీ...'పెనమలూరు' సీటు ఇవ్వాలని 'పార్థసారధి' డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల ఆయన 'జగన్‌'పై స్పష్టత కోరగా...'జగన్‌' దూషించారని ప్రచారం జరుగుతోంది. 'జగన్‌' ఆగ్రహంతో కొన్ని మాటలు అన్నారని..దాంతో 'పార్థసారధి' కన్నీళ్లు పెట్టుకుంటూ కారు ఎక్కి పోయారని ప్రచారం జరిగింది. అయితే ఇదే విషయంపై 'పార్థసారధి' పట్టుపడుతుండడంతో..అక్కడ ఎంత ఖర్చు పెడతావో.. చెప్పమని...'జగన్‌'...ఆయనను అడిగారని..ఆయన ఏదో సంఖ్య చెబితే..అది చాలదని..ఇంకా కావాలన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో..తాను చెప్పిన సొమ్ములు ఖర్చు పెడితేనే సీటు ఇస్తానని 'జగన్‌' స్పష్టం చేయడంతో..ఇక పార్టీలో తాను ఉండలేనని...నేడో..రేపో...నిర్ణయం తీసుకుంటానని..ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారట. ఇది ఇలా ఉంటే మరో సీనియర్‌ నేత 'జోగి రమేష్‌' పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 2009లో 'పెడన' నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ  అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తారువాత వైకాపాలో చేరడంతో..ఆయనను టిడిపి సీనియర్‌ నేత 'దేవినేని ఉమామహేశ్వరరావు'పై 'జగన్‌'పోటీకి నిలిపారు. ఈ ఎన్నికల్లో...'జోగి' ఓటమి చెందినా...'ఉమ'కు గట్టిపోటీ ఇచ్చారు. ఇక మళ్లీ అక్కడ నుంచే పోటీ చేయాలని...ఆయన భావించి ఏర్పాట్లు చేసుకుంటుండగా...ఆయనకు కూడా 'జగన్‌' షాక్‌ ఇచ్చారు. ఇక్కడి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త...వసంత కృష్ణప్రసాద్‌కు సీటు కేటాయిస్తున్నట్లు 'జగన్‌' ప్రకటించారు. దీంతో..కలత చెందిన 'జోగి'..తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో స్పష్టత ఇవ్వాలని 'జగన్‌' కోరినట్లు..దీనికి..'జగన్‌' స్పందిస్తూ..సొమ్ములు విషయం ఆరా తీయడంతో.. ఆయన దిగ్బ్రాంతికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద... కృష్ణా జిల్లాలో పోటీకి కొందరు ముందుకు రాకపోతుంటే.. పోటీ చేయాలనే వారిపై అనేక ఒత్తిళ్లు, ఆర్థిక విషయాలు ఎత్తుతుండడంతో..ఎవరికి వారు..తలో దారి చూసుకుంటున్నారని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

(4241)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ