WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' పార్టీలోకి 'పరిటాల' అనుచరుడు...!?

అనంతపురం జిల్లాలో సంచలనం...! కీ.శే.పరిటాల రవీంద్ర అనుచరుడు...ఒకరు ప్రతిపక్ష వైకాపాలో చేరుతున్నారని జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. 'పరిటాల రవీంద్ర' అనుచరుల్లో చాలా మంది ఆయన కోసం ప్రాణాలు త్యాగం చేశారు. మరి కొందరు..ఆయన ఫ్యామిలీ భద్రత కోసం ఎప్పుడైనా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అంటూ ఉంటారు..ఎన్నో లక్షల మంది 'రవి' అభిమానులు ఆ కుటుంబం కోసం ఏమైనా చేయడానికి సిద్దపడతారు. 'రవి' బతికి ఉన్నప్పుడు 'చమన్‌, పోతుల సురేష్‌ వంటి కీలకమైన అనుచరులే కాక చాలా మంది అజ్ఞాత మిత్రులు ఆయనకు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు. అటువంటి 'రవి' అనుచరుల్లో ఒకరు ఇప్పుడు వైకాపాలో చేరతారని తెలుస్తోంది.

  'రాప్తాడు'లో 'పరిటాల' కుటుంబాన్ని ఓడించడమే తమ లక్ష్యమని..దాని కోసం ఏమైనా చేస్తామని 'జగన్‌' ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. గత ఎన్నికల్లోనే తాము గెలవాల్సిందని..కొద్ది తేడాతో ఓడిపోయామని..ఈసారి మాత్రం 15వేలకు తగ్గకుండా మెజార్టీ సాధిస్తామని...ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి 'తోపుతుర్తి బ్రదర్స్‌' మీడియా సమావేశాల్లో చెబుతుంటారు. మెజార్టీ సంగతి తరువాత... గెలుపు సంగతి చూడాలని 'జగన్‌' చెప్పడంతో..ఇప్పుడు 'రవి' సన్నిహితుల్లో కొందరిని లోబరుచుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. వారిని తమ పార్టీలో చేర్చుకుని...'రవి' కుటుంబాన్ని ఓడించాలని...'జగన్‌' ఎత్తులు వేస్తున్నాడట. దీని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని..'రవి' సన్నిహితులు ఎవరు వస్తే వాళ్లను చేర్చుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చారట. దీంతో..తోపుతుర్తి బ్రదర్స్‌ 'రవి' మనుషులపై కన్నేశారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 'రవి'కి ఉన్న వేల మంది అనుచరుల్లో ఎవరో ఒకరు వైకాపాలో చేరితే..పెద్దగా నష్టం చేకూరదు కానీ...రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 'రవి' మనుషులు ఇలాంటి పని చేస్తారంటే ఎవరూ నమ్మరు. కానీ..ఇది వాస్తమని జిల్లాకు చెందిన కొందరు నాయకులు, మరి కొందరు 'రవి' అభిమానులు చెబుతున్నారు. అయితే వైకాపాలో చేరే 'రవి' మనిషి ఎవరు...? అనేదానిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' పలు వివరాలను సేకరించింది.

  'పరిటాల రవి' జీవించి ఉన్నప్పుడు ఆయనకు 'రాజన్న' అనే వ్యక్తి ఆయనకు జ్యోతిష్యం చెప్పేవాడట. అయితే..మొదట్లో...'రవి' ఈ వ్యక్తి చెప్పే జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మలేదని ఆ జిల్లాకు చెందిన కొందరు నాయకులు చెబుతుంటారు. అయితే... హైదరాబాద్‌లో శ్రీరాములయ్య సినిమా షూటింగ్‌ సమయంలో...'రవి'పై దాడి జరుగుతుందని...'రాజన్న'  అప్పట్లో 'రవి'కి చెప్పారట. ఆయన చెప్పినట్లే...'రవి'పై కారు బాంబు దాడి జరగడం..దానిని నుంచి 'రవి' తృటిలో తప్పించుకున్నా...దాదాపు డజనుకు పైగా అమాయక ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో 'రవి'పై జరిగే దాడి గురించి'రాజన్న'  ముందే చెప్పింది జరగడంతో..అప్పటి నుంచి 'రాజన్న'  జ్యోతిష్యాన్ని 'రవి' నమ్మేవారని మాట జిల్లాలో ప్రచారంలో ఉంది. ఆ దాడి తరువాత... 'రాజన్న' 'రవి' వెంటే ఉంటున్నారని...ఆయనను అడిగి 'రవి' ముహూర్తాలుపెట్టించుకునే వారని మాట ఉంది. ఇక అప్పటి నుంచి..'రాజన్న'  'రవి' స్వంత మనుషుల్లో ఒకరు అయిపోయారు. 'రవి' చనిపోయిన తరువాత కూడా..వారి కుటుంబంతో 'రాజన్న' కలసి నడుస్తున్నారు. అయితే..ఇప్పుడా 'రాజన్న' పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఆయన నేడో..రేపో వైకాపాలో చేరతారని వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో త్వరలోనే తేలనుంది. ఇప్పటి వరకు మాత్రం..ఇది నిజమనేనని..కొన్ని వర్గాలు దృవీకరిస్తున్నాయి. ఆయన చేరితే చేరవచ్చు..అని కొందరు నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదని కూడా వారు చెబుతున్నారు. మొత్తం మీద..రాప్తాడులో ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న 'జగన్‌' అండ్‌ కో చివరకు రవి సన్నిహితులపై కన్నేశారన్నది సుస్పష్టం. మరి..వారి ఎత్తులను మంత్రి సునీత, ఆమె తనయుడు ఎలా తిప్పికొడతారో..వేచి చూడాలి.

(2572)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ