లేటెస్ట్

‘ఈనాడు,ఆంధ్రజ్యోతి’ల‌కు నోటీసులు...!

తెలుగులో ప్రముఖ పత్రికలైన ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’ల‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పరువుకు భంగం కలిగే విధంగా ఈ రెండు పత్రికలు వార్తా కథనాల‌ను ప్రచురించాయని దీనిపై వివరణ ఇవ్వాల‌ని కోరినా స్పష్టమైన వివరణ ఇవ్వనందుకు ఈ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఉన్న సరస్వతి పవర్‌ మైనింగ్‌ లీజును రూల్స్‌ బ్రేక్‌ చేసి 50సంవత్సరాల‌ పాటు నీటిని ఇచ్చారని ‘చంద్రబాబు’ ఆరోపించారు. దీన్ని ‘ఈనాడు,ఆంధ్రజ్యోతి’లు ప్రచురించాయి. దీనిపై ప్రభుత్వ వివరణ ఇవ్వాల‌ని వారం రోజుల్లో వాళ్లు క్షమాపణ చెప్పాల‌ని, లేకపోతే క్రిమినల్‌ చర్యలు ఉంటాయని రాష్ట్ర భూగర్భ గనుల‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల‌కృష్ణ ద్వివేదీ మీడియాతో చెప్పారు. తప్పుడు కథనాల‌పై ఆయా పత్రికలు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేదని ఆయన చెప్పారు. కాగా.. పౌరసరఫరాల‌ శాఖ తరుపున కూడా ఈ రెండు సంస్థల‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల‌శాఖ నుంచి నిత్యావసర వస్తువుల‌ పంపిణీ చేసే సంచులు ‘జగన్‌’ కంపెనీ నుంచి తయారు అవుతున్నాయని ‘చంద్రబాబు’ ఆరోపించారు. దీన్ని ‘ఆంధ్రజ్యోతి’, ఈనాడు ప్రచురించాయి. దీనిపై వివరణ ఇవ్వాల‌ని, వారంలో రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని సివిల్‌ సప్లయిస్‌ కమీషనర్‌ మరియు ఎక్స్‌ అఫిషియో సెక్రటరీ ‘కోనశశిధర్‌’ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షనేత చేసిన ఆరోపణల‌ను ప్రచురిస్తే పత్రికల‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని చెప్పడంపై వివిధ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఇప్ప‌టికే టివి5పై ప్రభుత్వం కేసులు న‌మోదు చేయించింది. టివి5 యాంక‌ర్ మూర్తి, ఛైర్మ‌న్ నాయుడుల‌పై దేశ‌ద్రోహం కింద కేసులు న‌మోదు అయ్యాయి. 

(558)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ