జనసేన గెలిచే సీట్లు ఇవే..!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది. రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీని విజయం వరిస్తుందో..ఎన్ని సీట్లు వస్తాయో..ఖచ్చితంగా అంచనా వేసి చెప్పిన ఆల్ ఇండియా పీపుల్ పోల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌పై తన అంచనాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి,జనసేన కూటమి దాదాపు 150 సీట్లలో గెలుస్తుందని ఆ సర్వే సంస్థ వెల్లడించింది. అధికార వైకాపాకు కేవలం 25 సీట్లు మాత్రమే వస్తాయని, అదీ అతికష్టం మీద రావచ్చునని తెలిపింది. ఆ సంస్థ గతంలో ఇచ్చిన సర్వే అంచనాలన్నీ ఖచ్చితంగా జరిగాయి కనుక..ఇప్పుడు ఈ సర్వేను కూడా ఎక్కువ మంది నమ్ముతున్నారు. కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని తెలియడంతో..జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఎన్నిసీట్లు వారు గెలుస్తారనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పలు సర్వేల ప్రకారం జనసేన పీఠాపురం, విశాఖదక్షిణ, పెందుర్తి,అనకాపల్లి,యలమంచి, కాకినాడ రూరల్, రాజానగరం,రాజోలు,నిడదవోలు, భీమవరం,నర్సాపురం,తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తెనాలి,తిరుపతిలో గెలవబోతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రైల్వేకోడూరు, పాలకొండ,పోలవరం,గన్నవరంల్లో అధికార వైకాపా గెలవనుంది. నెల్లిమర్ల, ఉంగుటూరుల్లో నువ్వానేనా..అన్నట్లు ఉంది పరిస్థితి. మొత్తం 21 చోట్ల పోటీ చేస్తోన్న జనసేన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 15 చోట్ల గెలవనుంది. అదే విధంగా నాలుగుచోట్ల ఓటమి చెందనుంది. మొత్తం మీద 75శాతం విజయాలతో..ఆ పార్టీ అసెంబ్లీలోకి అడుగుపెట్టనుంది. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే పీఠాపురంలో ఆయనకు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆశిస్తున్నారు. అయితే..అంత మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని 20 నుంచి 30వేల తేడాతో ఆయన గెలుపొందే అవకాశం ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.