ఎస్సీ స్థానాల్లోనూ టిడిపి హవా...!
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఏడు రోజుల్లో వెలువడునున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అటు వైకాపా, ఇటు టిడిపి కూటమి హోరాహోరిగా పోరాడాయి. పోలింగ్ అనంతరం ఎవరు గెలుస్తారనే దానిపై పలు సర్వే సంస్థలు టిడిపి కూటమి గెలుస్తుందని తేల్చగా మరికొన్ని మాత్రం వైకాపాకు కొంత ఎడ్జ్‌ను ఇచ్చాయి. కాగా మెజార్టీ సంస్థలు టిడిపి కూటమి ఘనవిజయం సాధిస్తాయని పేర్కొంటున్నాయి. పేరుగాంచిన జాతీయ సంస్థలు టిడిపి కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తేల్చుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపే ఉన్నారని అవి పేర్కొంటున్నాయి. అధికార వైకాపా గట్టి పట్టున్న ఎస్సీ వర్గాలు కూడా ఈసారి కూటమి వైపు మొగ్గాయని చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఎస్సీ వర్గాలన్నీ వైకాపాకు అండగా నిల్చాయి. మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక్కటి తప్ప మిగతా అన్ని స్థానాలను వైకాపా పార్టీ గంపగుత్తగా గెల్చుకుంది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి లేదని తేలుతోంది. మొత్తం 29 ఎస్సీస్థానాల్లో ఈసారి టిడిపి కూటమికి దాదాపు 15 స్థానాలు లభిస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. అదే విధంగా వైకాపాకు 10 స్థానాలు లభిస్తాయని మరో నాలుగు స్థానాల్లో హోరాహోరి పోరు ఉంటుందని తెలిపాయి. వైకాపాకు గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ఈసారి కూటమి గెలవబోతోందని తెలుస్తోంది. ఆయా సర్వే సంస్థల రిపోర్టు ప్రకారం టిడిపి క్రింది స్థానాల్లో గెలవబోతోంది.
టిడిపి కూటమి గెలిచే ఎస్సీ స్థానాలు
1.నందికొట్కూరు
2.కొండపి
3. సంతనూతలపాడు
4. ప్రత్తిపాడు
5.వేమూరు
6.తాడికొండ
7.నందిగామ
8.చింతలపూడి
9.గోపాలపురం
10. కొవ్వూరు
11. పాయకరావుపేట
12. అమలాపురం
13. రాజాం
14. పి గన్నవరం - జనసేన
15. రాజోలు - జనసేన
వైకాపా గెలిచే ఎస్సీ స్థానాలు
1. సత్యవేడు
2. మడకశిర
3.కోడుమూరు
4.బద్వేలు
5.గూడూరు
6.సూళ్లూరిపేట
7.ఎర్రగుండపాలెం
8.పామర్రు
9.తిరువూరు
10.పార్వతీపురం
హోరాహోరి
1. పూతలపట్టు
2. గంగాధర నెల్లూరు
3. శింగనమల
4. కోడూరు