సుప్రీంకు చంద్రబాబు
తనపై నమోదైన అక్రమ కేసును కొట్టివేయాలని కోరుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సుప్రోంకోరు్టను ఆ్రశయించారు. నిన్న హైకోర్టులో ఆయన క్వాష్ పిటీషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. తనపై మోపిన కేసులన్నీ అక్రమంటూ వాటిని కొట్టివేయాలంటూ చంద్రబాబు ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టుదాకా తరువాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనపై మొదటి నుంచీ ప్రభుత్వం అక్రమంగా వ్యవహరిస్తుందని, తాను చేశానంటోన్న అవినీతికి ఎటువంటి ఆధారాలు లేవని, రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టారని వాటిని కొట్టేయాలని ఆయన సుప్రీం తలుపు తట్టారు. చంద్రబాబు వేసిన పిటీషన్ సోమవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుటకు వస్తోంది. కాగా ఈ రోజు చంద్రబాబును సీఐడీ పోలీసులు కస్టడిలో విచారిస్తున్నారు. ఆయన విచారణ తీరుపై టిడిపి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా అవమానిస్తారని, చేయి చేసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశ్వపూర్వకంగా చంద్రబాబును వేధిస్తోందని, ఆయన కస్టడిలో సిఐడి పోలీసులు వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని మాజీ జడ్జి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబుకు ఏమైనా అయితే ప్రజలందరూ స్వచ్ఛంధంగా రోడ్లపైకి వస్తారని, రాష్ట్రంలో అల్లకల్లోలం రేగుతుందని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద చంద్రబాబుకు సోమవారం నాడు ఊరట లభిస్తుందా..? లేక సుప్రీంలో కూడా కాలయాపన జరుగుతుందా..? అన్న సందేహాలు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. ఇది ఇలా ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను అరెస్టు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఇంకోవైపు రాష్ట్రంలోకి లోకేష్ అడుగుపెడితే ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.