దొరికిన వాసుదేవరెడ్డి..వణికిపోతోన్న జగన్ అండ్ కో...!?
మద్యం కుంభకోణంలో కీలకమైన మద్యం దొంగ వాసుదేవరెడ్డి పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యం కుంభకోణంలో తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ఫైల్స్‌తో పరార్ అయిన బేవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి పరార్ అయ్యారు. దాదాపు రెండు నెలల నుంచి ఆయన పరార్‌లో ఉన్నారు. ఆయనను పట్టుకోవడానికి సీఐడీ అధికారులు ఎంత ప్రయత్నించినా ఆయన దొరకలేదు. ఆయన నివాసంలో, హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. అయితే..ఆయన రహస్య జీవితం గడుపుతుండడంతో సీఐడీ అధికారులను ఆయనను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆయన ఆచూకి ఈరోజు సీఐడీ అధికారులను లభించింది. దీంతో ఆయనను అరెస్టు చేసి ఒక ప్రత్యేక ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వాసుదేవరెడ్డి బేవరేజ్ కార్పొరేషన్ ఎండిగా నియమించారు. జగన్ కోసమే వాసుదేవరెడ్డి పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం ఆదాయాన్ని చూపి భారీగా అప్పులు తేవడంతోపాటు, నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేటుకు అమ్మడం, డిస్ట్రిలర్‌తో ఒప్పందాలు, ఊరూ పేరు లేని బ్రాండ్‌లు తేవడం, మద్యం కొనుగోళ్లలో అక్రమాలు, మద్యం షాపుల్లో నగదు రహిత అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు ఆరోపణలను వాసుదేవరెడ్డి ఎదుర్కొంటున్నారు. వాసుదేవరెడ్డి హయాంలో బేవరేజ్ కార్పొరేషన్‌లో దాదాపు రూ.40వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని టిడిపి ఆరోపిస్తోంది. ఇది ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఎక్కువని కూడా ఆ పార్టీ చెబుతోంది. తాము అధికారంలోకి వచ్చిన తరువాత..దీనిపై విచారణ చేస్తామనిప్రకటించింది. చెప్పినట్లుగానే..కూటమి ప్రభుత్యం మద్యం అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపిస్తోంది. ముఖ్యంగా నాసిరకం మద్యాన్ని ఎక్కువరేట్లకు అమ్మడం, అమ్మిన మొత్తాలను జగన్‌కు ఇంటికి చేర్చడంలో వాసుదేవరెడ్డి కీలకపాత్ర పోషించారని, ఇప్పుడు ఆయన దొరకడంతో..ఈ మొత్తం అవినీతిలో జగన్ వాటా తేలుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విచారణలో సీఐడీకి సహకరిస్తే ఆయన నోటి ద్వారా అక్రమ మద్యంలో జగన్ కుటుంబ వాటా ఎంతో తేలుతుంది. జగన్‌తోపాటు ఆయన భార్య భారతి కూడా మద్యం కుంభకోణంలో పాత్ర ఉందని, ఆమె కాకుండా వైకాపా ముఖ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, ఆయన భార్యకు కూడా మద్యం కుంభకోణంలో పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయి. వాసుదేవరెడ్డి ఇప్పుడు సీఐడీ విచారణలో నోరు విప్పుతారని, తరువాత భారతి, జగన్, సజ్జలకు ఈ కేసులో సీఐడీ నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తుందని, తరువాత ఈ కేసులో వారిని అరెస్టు కూడా చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.మొత్తం మీద..మద్యం కుంభకోణంలో కీలక విక్కెట్టు దొరికిందని, తరువాత దీని వెనుక ఉన్న పెద్దల ముఠామొత్తం బయటకు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..మెల్లమెల్లగా అవినీతిపరులు, అక్రమార్కులకు ఉచ్చు బిగిస్తోంది. ఏ ఒక్క అవినీతిపరుడినీ, అక్రమార్కులనీ వదిలేది లేదని, చట్టప్రకారం అందరిపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి లోకేష్ మాటలు నిదానంగానైనా వాస్తరూపం దాల్చుతున్నాయి.