లేటెస్ట్

‘రాయలసీమ’లో ‘టిడిపి’కి 22 సీట్లు..!

గత సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో ఘోరంగా దెబ్బతిన్న ‘తెలుగుదేశం’ పార్టీ భారీగా కోలుకున్నట్లు ఓ సర్వే స్పష్టం చేసింది. ఆర్‌టి నిర్వహించిన సర్వేలో ఈ ప్రాంతంలో టిడిపికి 22 సీట్లు వస్తాయని తేలింది. టివి9 మాజీ సిఇఓ ‘రవిప్రకాష్‌’ వ్యాఖ్యాతగా ఆర్‌టివి సర్వే వివరాలను వెల్లడిరచింది. ఈ సర్వేకు ‘రవిప్రకాష్‌’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన సర్వే ప్రకారం  ఉమ్మడి ‘రాయలసీమ’లో  మొత్తం 52 సీట్లు ఉన్నాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో  వైకాపాకు 29 స్థానాలు, టిడిపికి 22, కాంగ్రెస్‌కు ఒకటి వస్తుందని సర్వే పేర్కొంది. జిల్లాల వారిగా కర్నూలులో 14 సీట్లు ఉంటే వీటిలో వైకాపాకు 10, టిడిపికి 4 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో ‘కర్నూలు’లో టిడిపికి ఒక్క స్థానమూ రాలేదు. ఈసారి మాత్రం నాలుగు సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ‘ఆళ్లగడ్డ’లో ‘భూమ అఖిలప్రియ, కర్నూలులో ‘టిజి భరత్‌’, బనగానపల్లెలో ‘బీసీ జనార్థన్‌రెడ్డి, ఎమ్మిగనూరులో ‘జయనాగేశ్వరరెడ్డి’లు గెలుపొందుతారని సర్వే తెలిపింది. మిగతా 10 సీట్లలో వైకాపానే గెలవనుంది. ఇక కడపలో 10 అసెంబ్లీ సీట్లు ఉంటే వీటిలో టిడిపికి 3, వైకాపాకు 7 స్థానాలు వస్తాయని సర్వే స్పష్టం చేసింది.టిడిపి ‘రాజంపేట,మైదుకూరు, ప్రొద్దుటూరు’లో గెలుపొందుతుందని సర్వే తెలిపింది.


చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉంటే టిడిపికి 7, వైకాపా7కు స్థానాలు వస్తాయని సర్వే పేర్కొంది. టిడిపికి తంబళ్లపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి, నగరి, కుప్పం, పలమనేరు, చిత్తూరులు వస్తాయని తేల్చింది. అనంతపురంలో మొత్తం 14 సీట్లు ఉంటే వాటిలో టిడిపికి 8, వైకాపాకు 5 కాంగ్రెస్‌కు ఒక స్థానం వస్తాయని సర్వే చెప్పింది. వీటిలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, కల్యాణదుర్గం, హిందూపురం, పెనుకొండ, కదిరి స్థానాల్లో టిడిపి గెలవనుంది. అయితే..అనంతపురంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘రాప్తాడు, తాడిపత్రి’లో టిడిపి ఓటమి చెందునుందని సర్వే పేర్కొనడం విశేషం. తాడిపత్రి ‘జెసి సోదరుల అడ్డా కాగా ‘రాప్తాడు’ ‘పరిటాల రవి’ కోట. అయితే..ఈ రెండు చోట్లా టిడిపి ఓడిపోనుందని సర్వే చెప్పడం టిడిపిలో ఆందోళన కల్గిస్తోంది. కాగా..గత ఎన్నికల్లో రాయలసీమలో మూడు సీట్లకే పరిమితమైన టిడిపి ఇప్పుడు 22 సీట్లు గెలుచుకోబోతోందన్న వార్తలు టిడిపిలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘జగన్‌’ బలంగా ఉన్న రాయలసీమలోనే ఆయనతో పోటాపోటీగా సీట్లు సాధిస్తే ఇక ‘ఆంధ్రా’ ప్రాంతంలో టిడిపి కూటమి స్వీప్‌ చేస్తుందని వారు అంచనా వేస్తున్నారు. కాగా రాయలసీమలో ‘జనసేన, బిజెపి’ పార్టీలు రెండూ కలసి ఒక్క సీటును కూడా గెలవలేవని సర్వే స్పష్టం చేసింది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ