ఫైబర్ నెట్ కేసు నవంబర్9కి వాయిదా...!
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సుప్రీంలో వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ నవంబర్9కి వాయిదా పడింది. పైబర్‌నెట్ కేసును ఈ రోజు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం కేసును నవంబర్ 9వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. కాగా స్కిల్ కేసులో ఈ రోజు తీర్పు వస్తుందని భావించగా, దానిపై తీర్పు రాలేదు. స్కిల్ కేసును పరిష్కరించిన తరువాత పైబర్ కేసును విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.