లేటెస్ట్

వైకాపా ఎమ్మెల్యే ‘ఆళ్ల’ రాజీనామా

మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి,పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం నాడు ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌ పంపారు. హఠాత్తుగా రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. గత కొన్నాళ్లుగా ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని విషయంలోనూ, దేవాదాయ భూముల విషయంలోనూ..‘ఆళ్ల రామకృష్ణారెడ్డి’ కోర్టుల్లో పలు కేసులు వేసి, అప్పటి అధికారపక్షమైన టిడిపిని నానా ఇబ్బందులకు గురిచేశారు. టిడిపి కేంద్రకార్యాలయం నిర్మించిన భూమి ఎసైన్‌భూమి అంటూ కూడా ఆయన కేసు వేశారు. టిడిపిని న్యాయపరంగా ఆయన తీవ్ర చికాకులు సృష్టించారు. టిడిపిపై ఆయన చేసిన పోరాటంతో అధికారంలోకి రావడంతోనే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేదు. తన కోసం, తన కుటుంబం కోసం తీవ్రంగా కష్టపడి పనిచేసిన ‘ఆళ్ల’ను ‘జగన్‌’ పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన అసంతృప్తిని పలుసార్లు బహిరంగంగానే ప్రకటించినా..జగన్‌ ఆలకించలేదు. మంత్రి పదవి ఇవ్వకపోయినా..కనీసం ఏదో కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి అయినా ఇస్తారని ఆశించిన ‘ఆళ్ల’కు అదీ దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రెండుసార్లు మంగళగిరి నుంచి గెలిచిన ఆయన ‘వై.ఎస్‌’ కుటుంబానికి సన్నిహితుడనే పేరుంది. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత తననుపట్టించుకోకపోవడం, అవసరం ఉన్నప్పుడు వాడుకుని ఇప్పుడు ఎంగిళి ఆకు వలే..పక్కన పడేయడం ‘ఆళ్ల’కు తీవ్ర అసహనానికి, అసంతృప్తికి గురిచేసింది.పైగా వచ్చే ఎన్నికల్లో తన సీటు ఇవ్వరన్న భయం కూడా ఆయన రాజీనామాకు దారి తీసిందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టిడిపి ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు కుమారుడు ‘లోకేష్‌’పైన ఆయన విజయం సాధించారు. అంతకుముందు కేవలం 12 ఓట్లు తేడాతో..గెలుపొందారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ