లేటెస్ట్

రాష్ట్రంలో హ‌ఠాత్తుగా IASల బ‌దిలీలు

రాష్ట్ర ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగా ప‌లువురు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది. వీరిలో కొన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారులు ఉన్నారు. ఈరోజు వారిని బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాధ్ దాస్ ఉత్వ‌ర్వుల‌ను జారీ చేశారు. తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ గా ఉన్న ముర‌ళీధ‌ర్ రెడ్డిని APMSIDC ఎండిగా నియ‌మించింది. APMSIDC ఎండిగా ఉన్న విజ‌య‌రామ‌రాజును వైఎస్సార్ క‌డప జిల్లా క‌లెక్ట‌ర్ గా నియ‌మించింది. ప్ర‌స్తుతం క‌డ‌ప క‌లెక్ట‌ర్ గా ఉన్న చెరువూరి హ‌రి కిర‌ణ్ ను తూర్పుగోదావ‌రి క‌లెక్ట‌ర్ గా నియ‌మించింది.  చాలా కాలంగా బ‌దిలే చేస్తార‌ని భావిస్తున్న విశాఖ‌ప‌ట్నం క‌లెక్ట‌ర్ వాడ్రేవు విన‌య్ చంద్ ను డాక్ట‌ర్ YSR Aarogyasri Health Care Trust సీఇఓగా నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆరోగ్య‌శ్రీ సీఇఓగా ఉన్న డాక్ట‌ర్ మ‌ల్లిఖార్జున్ ను విశాఖ క‌లెక్ట‌ర్ గా ప్ర‌భుత్వం నియ‌మించింది. విజ‌య‌న‌గ‌రం Collectorగా ఉన్న డాక్ట‌ర్ ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ను R & R  Commissionerగా నియ‌మించారు.


పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉన్న ఎ.సూర్య‌కుమారిని విజ‌య‌న‌గ‌రం Collectorగా ప్ర‌భుత్వం నియ‌మించింది. క‌ర్నూలు క‌లెక్ట‌ర్ గా ఉన్న జి.వీర‌పాండ్య‌న్ ను A.P. State Civil Supplies Corporation ఎండిగా నియ‌మించారు. ఆయ‌న స్థానంలో విశాఖ VMRDA క‌మీష‌న‌ర్ గా ఉన్న పి.కోటేశ్వ‌ర‌రావును బ‌దిలీ చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జాయింట్ క‌లెక్ట‌ర్ గా ఉన్న కె.వెంక‌ట ర‌మ‌ణారెడ్డిని VMRDA క‌మీష‌న‌ర్ గా నియ‌మించారు. శ్రీ‌కాకుళం జాయింట్ క‌లెక్ట‌ర్ గా ఉన్న సుమిత్ కుమార‌ను ప‌శ్చిమ‌గోదావ‌రి జాయింట్ క‌లెక్ట‌ర్ గా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఆయ‌న స్ధానంలో A.P. State Handloom Weavers Cooperative Society ఎండిగా ఉన్న బి.ఆర్.అంబేద్క‌ర్ ను శ్రీ‌కాకుళం జాయింట్ క‌లెక్ట‌ర్గా నియ‌మించారు. దేవాదాయ‌శాఖ ప్ర‌త్యేక క‌మీష‌న‌ర్ గా ఉన్న పి.అర్జున్ రావును హ్యాండ్ లూమ్ మ‌రియు టెక్స్ట్ట‌టైల్ప్ డైరెక్ట‌ర్ గా బ‌దిలీ చేశారు. ఆయ‌న నిర్వ‌హిస్తోన్న పోస్టుకు ఎండోమెంట్ ప్రిన్పిప‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న వాణీమోహ‌న్ కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.   కాకినాడ మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ గా ఉన్న స్వ‌ప్నిల్ ను చిత్తూరు జాయింట్ క‌లెక్ట‌ర్ గా బ‌దిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తోన్న ఎం.ప్ర‌భాక‌ర్ రెడ్డిని YAT&C ఎండిగా నియ‌మించారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ