లేటెస్ట్

గోదావరి జిల్లాలు క్లీన్‌స్వీప్‌…!

నిన్న జనసేన అధినేత ‘పవన్‌కళ్యాణ్‌’ రాజమండ్రి జైలులో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడిని కలిసిన తరువాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొన్నటి వరకు టిడిపి, జనసేన కలవవని, బిజెపి పెద్దలు వారిని కలవనీయకుండా చేస్తారనే భావన వైకాపా వర్గాల్లో, ఆ పార్టీని అభిమానించే వారిలో ఉంది. టిడిపి, జనసేన కలిస్తే తమ పని అయిపోతుందనే భయం వారిలో ఉంది. అందుకే వారిద్దరినీ కలవనీయకుండా తెరవెనుక ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే వారు అనుకున్నదొకటైతే..హఠాత్తుగా ‘పవన్‌’ పొత్తు ప్రకటించి వారి గుండెల్లో రాయివేశారు. ఏదోరకంగా వారు కలవకపోతే ఓట్లు చీలి తమకు మేలు జరుగుతుందన్న వారి ఆశలను ‘పవన్‌’ అడియాశలు చేశారు. ‘పవన్‌’ టిడిపితో కలిస్తే ఏమి జరుగుతుందో తెలిసే వారు అలా భయపడుతున్నారు. ఉదాహరణకు ఉభయగోదావరి జిల్లాలను తీసుకుంటే ‘జనసేన, టిడిపి’లు కలిసి పోటీ చేస్తే వైకాపాకు ఒక్క సీటు కూడా రాదనే భయం వారిలో ఉంది. గత ఎన్నికల్లో టిడిపి, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి వైకాపా ఈ జిల్లాల్లో భారీగా సీట్లు సాధించింది. ఇప్పుడు కూడా వారిద్దరూ వేరువేరుగా పోటీ చేస్తే మళ్లీ ఓట్లు చీలి అదే విధంగా లాభపడతామనే ఆశ వారిలో ఉంది. అయితే ఈసారి అటువంటి పొరపాట్లకు తావివ్వకుండా టిడిపి,జనసేనలు ముందుగానే పొత్తుపై ఒక నిర్ణయానికి రావడం వైకాపా ఆశలను అడియాశలు చేసింది. వాస్తవానికి ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలలు సమయం ఉందని, ఈలోపు,టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకోకుండా అడ్డుకోవచ్చనే వ్యూహం వైకాపా పెద్దల్లో ఉంది. అయితే ‘చంద్రబాబు’ను అక్రమంగా అరెస్టు చేయడంతో ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందు ప్రకటించాలనుకున్న టిడిపి,జనసేన పొత్తును ఆ పార్టీ అధినేతలు ముందుగానే ప్రకటించారు. దీంతో వైకాపా నేతల్లో ఓటమి భయం పట్టుకుంది. ఉభయగోదావరి జిల్లాలో మొత్తం 34 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో వైకాపా దీనిలో 27 సీట్లు సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలకు కేవలం ఏడు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో టిడిపి కొన్నిచోట్ల కేవలం ఐదు వేలు, ఎనిమిది వేలు ఓట్లతో ఓడిపోయింది.

 అదే జనసేనతో కలిసి పోటీ చేస్తే వైకాపా గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి అయినా ఉండేది. నాడు జనసేన, టిడిపి విడివిడిగా పోటీ చేయడంతో లాభపడిన వైకాపాకు ఈసారి అటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి ఇప్పటికే వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే ఉభయగోదావరి జిల్లాలో క్లీన్‌స్వీప్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ