లేటెస్ట్

సెల‌వులో వెళ్ల‌నున్న ఉన్న‌త పోలీసు అధికారి...!

పోలీసుశాఖ‌లో ఉన్న‌త స్థానంలో ఉన్న ఓ పోలీసు ఉన్న‌తాధికారి సెల‌వులో వెళ్లబోతున్న‌ట్లు స‌మాచారం. వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఎంతో కీల‌క‌మైన ప‌దవిలో ఉన్న ఆ అధికారికి ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో సంబంధాలు దెబ్బ‌తిన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మొద‌ట్లో ముఖ్య‌మంత్రి ఆయ‌న‌కు ఎంతో ప్ర‌ధాన్య‌త ఇచ్చారు. ఉన్న‌తాధికారిగా ఉన్న ఆయ‌న ముఖ్య‌మంత్రి ఆదేశాల‌కు అనుగుణంగా ప‌నిచేసి ఆయ‌న మ‌న్న‌ల‌ను పొందారు. స‌మ‌ర్థుడు, నిజాయితీప‌రుడైన ఆయ‌న అన్ని వ‌ర్గాల‌కు అందుబాటులో ఉంటార‌నే పేరు ఉంది. గ‌త టిడిపి ప్ర‌భుత్వ హయాంలో కూడా ఆయ‌న స‌మ‌ర్ధవంతంగా ప‌నిచేశారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆయ‌న ప‌నితీరుకు మెచ్చి ఆయ‌న‌కు కీల‌క‌మైన పోస్టుల‌ను క‌ట్టపెట్టారు.


ప్ర‌ముఖ న‌గ‌రంలో ఆయ‌న త‌న విధుల‌న అద్భుతంగా నిర్వ‌హించార‌నే ప్ర‌జ‌ల కూడా మెచ్చుకున్నారు. అటువంటి అధికారికి వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కీల‌క‌మైన పోస్టును క‌ట్ట‌బెట్టింది. అయితే ఇటీవ‌ల కాలంలో ఓ ప్ర‌జాప్ర‌తినిధి విష‌యంలో జ‌రిగిన ర‌గ‌డ సంద‌ర్భంగా సద‌రు పోలీసు అధికారి నిర్వ‌హించిన పాత్ర‌పై అధికార‌పార్టీ నేత‌ల‌కు అనుమానం క‌లిగింద‌ట‌. అంతేకాకుండా ఆ విష‌యంలో సద‌రు ఐపీఎస్ అధికారి కింద ప‌నిచేసే అధికారి ముఖ్య‌మంత్రికి లేనిపోని చాడీలు చెప్పార‌ట‌. దీంతో ముఖ్య‌మంత్రి ఆయ‌న‌ను దూరం పెట్టార‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో స‌ద‌రు అధికారి మొహం కూడా చూడ‌డానికి సిఎం ఇష్ట‌ప‌డ‌లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎంతో నిబ‌ద్ద‌త‌తో విధుల‌ను నిర్వ‌హించిన త‌న‌పై ముఖ్య‌మంత్రి చిన్న చూపుచూడ‌డం త‌ట్టుకోలేని సద‌రు అధికారి సెల‌వుపై వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ