లేటెస్ట్

‘ర‌ఘు’ను ఏమీ చేయ‌లేమా..?

వైకాపా ఎంపీల్లో అంత‌ర్మ‌ధ‌నం

వైకాపా రెబెల్ ఎంపి ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌మ పార్టీ అధినేతను, పార్టీ ఎంపీల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. త‌న‌ను ధిక్క‌రించి త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తోన్న రఘ అంతం చూడాల‌నుకున్న అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌డానికి వైకాపా ఎంపీలు దిగే గ‌డ‌ప‌..ఎక్కే గ‌డ‌ప అన్న‌ట్లుగా ఢిల్లీతో తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని గ‌డ‌ప‌లు తొక్కినా, ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వారి ల‌క్ష్యం నెర‌వేర‌డం లేదు. పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి త‌న‌కు ఉన్న ప‌రిచియాల‌న్నింటిని ఉప‌యోగించి, ర‌ఘుపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని య‌త్నిస్తున్నా అంత స‌ఫ‌లం కావ‌డం లేదు. పార్టీకి చెందిన ఎంపీలంద‌రినీ తీసుకుని ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయించాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు. అయినా అక్క‌డ ప‌నిజ‌ర‌గ‌లేదు. రాష్ట్ర స‌మ‌స్య‌ల పేరుతో ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌ల‌సి ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. మ‌రో వైపు లోక్ స‌భ, రాజ్య‌స‌భ‌లోనూ ర‌ఘురామ వ్య‌హారాన్ని లేవ‌నెత్తున్నారు. ఎంపీల చేత ప్లేకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ ర‌ఘును స‌స్పెండ్ చేయాల‌ని నినాదాలు ఇప్పిస్తున్నారు.  


తాజాగా ఓ టీవీ ఛానెల్ అధినేత‌, రఘురామ‌కృష్ణంరాజులు క‌ల‌సి హ‌వాలామార్గంలో సొమ్ములు త‌ర‌లించార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి లేఖ రాశారు. మ‌రోవైపు ఆయ‌న దేశాన్ని వీడిపోకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆయ‌న పాస్ పోర్టును స్వాధీనం చేసుకోవాల‌ని కూడా ఆయ‌న లేఖ‌లో రాశారు. అయినా కేంద్రం నుంచి ఎటువంటి చ‌ర్య‌లు లేవు. అయితే మొత్తం ఈ వ్య‌వ‌హారంపై వైకాపా ఎంపీలు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఒక్క‌డి కోసం ఇంత‌మంది ఇంత‌గా తిర‌గ‌డం ఏమిటి? ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తే పోతుంది క‌దా...? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇగో కోసం ఇంత‌గా ఇబ్బంది ప‌డాలా..? మ‌నం ఎన్ని చేసినా కేంద్ర పెద్ద‌ల మ‌ద్ద‌తు రఘుకు ఉంది. ఆయ‌నను వారు వ‌దులుకోరు. అటువంటి ప‌రిస్థితుల్లో కాని ప‌నికోసం ఎందుకీ తిప్ప‌లు అంటూ నిట్టూరుస్తున్నారు. మొత్తం మీద వైకాపా ఎంపీలు ‘ర‌ఘు’ విష‌యంలో తాము ఏమీ చేయ‌లేమ‌నే స్థితికి వ‌చ్చార‌ట‌. అధినేత మెప్పుకోసం కొంద‌రు ‘ర‌ఘు’ విష‌యంలో అతిగా చేస్తున్నార‌ని, కానీ ఈ విషయంలో తామ మ‌రీ ప‌ట్టుద‌ల‌కు పోతే గెలిస్తే ప‌ర్వాలేద‌ని, అదే ఓడిపోతే మ‌రింత ప‌రువుపోంద‌నే భ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ