4.5శాతం పెరిగిన టిడిపి ఓటు..!
టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన తరువాత, ఒక్కసారిగా టిడిపి ఓటు బ్యాంక్ పెరిగిపోయిందని ఓ సర్వే తేల్చింది. నాయుడు అరెస్టు తరువాత టిడిపికి అనుకూలంగా 4.5శాతం ఓట్లు పెరిగాయని, చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్ర ప్రజలు ఎక్కుమంది భావిస్తున్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. మొన్నటి దాకా మహిళా ఓటర్లు ఎటువైపు ఉన్నారో ఎవరికీ అర్థం కాలేదని, జగన్ సంక్షేమపథకాలు అమలు చేస్తున్నాడు కనుక వారంతా వైకాపా వెంట ఉన్నారని వైకాపాకు చెందిన మీడియా ఊదరగొట్టింది. అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తరువాత ఆ అభిప్రాయం మారిపోయింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత మహిళలు ఆయనపై సానుభూతి చూపిస్తున్నారని, 75 ఏళ్ల చంద్రబాబు ఎటువంటి తప్పు చేయకపోయినా ఆయనను అరెస్టు చేసి వేధిస్తున్నారనే భావన వారిలో వ్యక్తం అవుతోందని ఆ సర్వే చెబుతోంది. చంద్రబాబు అరెస్టు తరువాత ఎవరూ ఎటువంటి పిలుపు ఇవ్వకపోయినా, నాయకత్వం వహించకపోయినా, విజయవాడ, గుంటూరు ఇంకా ఇతర పట్టణాల్లో మహిళలు స్వచ్ఛంధంగా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేశారని, వారంతా స్వచ్ఛంధంగా రావడంతో రాబోయే ఎన్నికల్లో మహిళలు ఎటువైపు ఉండబోతున్నారో స్పష్టం అవుతోందని సర్వే సంస్థ తెలిపింది. అదే విధంగా విద్యార్థినులు కూడా చంద్రబాబుకు మద్దతుగా బయటకు వస్తున్నారని, వారిలో ఒక అభిప్రాయం ఏర్పడిన తరువాత వారి అభిప్రాయాన్ని ఎవరూ మార్చలేరని, జగన్ నియంతృత్వాన్ని వారు సహించలేకపోతున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళా శక్తి పవర్ ఏమిటో చూపిస్తారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. చంద్రబాబు ఇంకా జైలులో ఉంటే ఆయనకు ఇంకా మద్దతు పెరిగిపోతుందని, చివరకు ఇది ఒక ప్రజాఉద్యమంగా మారి జగన్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించివేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి