సినీతారల సందడితో పలమనేరులో జీఎస్‌ఆర్ జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్
పలమనేరు, ఆగస్టు 14 :పలమనేరు పట్టణంలోని లక్ష్మణ్ సింగ్ స్ట్రీట్, న్యూపేటలో జీఎస్‌ఆర్ జ్యువెలరీ నూతన షోరూమ్ శుక్రవారం సినీతారల సందడి మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎన్. అమర్‌నాథ్ రెడ్డి సమక్షంలో ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, ఫెమినా మిస్ ఇండియా–2020 మానస వారణాసి ముఖ్య అతిథులుగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.
నూతన షోరూమ్ ప్రారంభోత్సవంతో పలమనేరు పట్టణంలో సందడి నెలకొంది. సినీ నటి నిధి అగర్వాల్ ప్రత్యేకంగా జీఎస్‌ఆర్ జ్యువెలరీ యాప్‌ను ప్రారంభించారు. బంగారం, వెండి, వజ్రాభరణాలు, యాంటిక్ జ్యువెలరీతో పాటు ఆధునిక డిజైన్లలో రూపొందించిన విభిన్న ఆభరణాల కలెక్షన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.పెళ్లిళ్లు, వధూవరుల వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వివాహ ఆభరణాల కలెక్షన్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జోడించి రూపొందించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఆగస్టు 14 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. బంగారు ఆభరణాలపై జీరో శాతం మేకింగ్ ఛార్జెస్, 916 బంగారం తరుగు ఛార్జీలపై 40 శాతం వరకు తగ్గింపు, పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.150 వరకు అదనపు విలువ అందిస్తున్నట్లు తెలిపారు.జీఎస్‌ఆర్ జ్యువెలరీ నిర్వాహకులు సురేష్ బాబు అండ్ సన్స్ మాట్లాడుతూ, పలమనేరు ప్రజల ఆదరణ, నమ్మకమే తమ సంస్థ అభివృద్ధికి ప్రధాన కారణమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంచెలంచెలుగా ఎదిగామని తెలిపారు.ప్రతి కస్టమర్‌కు నాణ్యతతో పాటు ఆత్మీయమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు బద్రి, వెంకటేష్ పేర్కొన్నారు. సంప్రదాయ నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో మేళవించి అత్యుత్తమ ఆభరణాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పలమనేరు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నూతన షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.